#ReddigarintloRowdyism: రెడ్డిగారింట్లో రౌడీయిజం ఫస్ట్ లుక్ పోస్టర్
Reddigarintlo Rowdyism First Look Poster release
Reddigarintlo Rowdyism : సినిమాల మీద ప్యాషన్‌తో రమణ్ అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. సీనియర్ హీరో వినోద్ కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండటం విశేషం.
సిరి మూవీస్ బ్యానర్‌పై కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. రమేష్-గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో సుమన్ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్ర బృందం. టైటిల్ ఆసక్తికరంగా ఉందనీ, సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాననీ సుమన్ అన్నారు.
కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సినిమా రూపొందుతోంది!!
No comment allowed please