Reed Hastings Resign : నెట్‌ఫ్లిక్స్ సిఇఓ రీడ్ హేస్టింగ్స్ గుడ్ బై
20 ఏళ్ల పాటు సేవలకు మంగళం
Reed Hastings Resign : అంతర్జాతీయ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు కోలుకోలేని షాక్ తగిలింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, సిఇఓగా ఉన్న రీడ్ హేస్టింగ్స్ తన పదవికి రాజీనామా(Reed Hastings Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. ఆన్ లైన్ లో సినిమాలు, టీవీ షోలను అందించడం ద్వారా పేరు పొందేలా చేశారు.
దీర్ఘ కాల బాగస్వామి, కో సిఇఓగా ఇప్పటి వరకు ఉన్న టెడ్ సరండోస్ , చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్రెగ్ పీటర్స్ కు పగ్గాలు అప్పగించారు. నెట్ ఫ్లిక్స్ షేర్లు 6.1 శాతం పెరిగాయి. దీంతో $335.05కి చేరాయి. ఎందుకంటే స్ట్రీమింగ్ మార్గదర్శకుడడు కూడా గత ఏడాది చివరలో ఊహించిన దాని కంటే ఎక్కువ మంది సభ్యులను పొందినట్లు చెప్పారు.
2022 ప్రథమార్థంలో కస్టమర్లను కోల్పోయింది. తర్వాత కంపెనీ ఒత్తిడికి లోనైంది. రీడ్ హేస్టింగ్స్ వైదొలగడంతో సరండోస్ , పీటర్స్ సిఇవోలుగా పంచుకుంటారు. హేస్టింగ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నారు. ఈ మార్పు తక్షణమే అమలులోకి వస్తుందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది.
ఇదిలా ఉండగా కంపెనీ వాల్ట్ డిస్నీ, అమెజాన్. కామ్ ఇంక్ , ఆన్ లైన్ ప్రేక్షకుల కోసం టీవీ షోలు, మూవీస్ ను రూపొందించేందుకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ వినియోగదారుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. కీలక నిర్ణయాలు తీసుకుంది సంస్థ. ఈ కీలక సమయంలో రీడ్ హేస్టింగ్స్ తప్పు కోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
మొత్తం మీద రాబోయే కాలంలో నెట్ ఫ్లిక్స్ ఏ మేరకు పోటీని తట్టుకుని నిలబడగలదో చూడాలి.
Also Read : వీడియోకాన్ గ్రూప్ మాజీ చీఫ్ కు బెయిల్