Jai Shankar : భ‌ద్ర‌తా మండ‌లిలో సంస్క‌ర‌ణ‌లు కీల‌కం

విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ కామెంట్

Jai Shankar :  ఐక్య రాజ్య స‌మితిలోని భ‌ద్ర‌తా మండ‌లిలో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(Jai Shankar). కేంద్ర మంత్రి చేసిన కీల‌క సూచ‌న‌ల‌ను అమెరికాతో పాటు కీల‌క దేశాల‌న్నీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఇదే స‌మ‌యంలో శాశ్వ‌త స‌భ్య‌త్వం కోసం భార‌త్ కు సపోర్ట్ చేస్తున్న‌ట్లు తెలిపాయి.

అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఎల్ల‌ప్పుడూ స‌హాయ స‌హ‌కారాలు అందజేస్తామ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా సెక్యూరిటీ కౌన్సిల్ లో సంస్క‌ర‌ణ‌లు చ‌ర్చ‌నీయాంశాల‌లో ఒక‌టిగా ఉంటాయ‌ని చెప్పారు. కాగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వాషింగ్ట‌న్ డీసీలోని యునైటెడ్ స్టేట్స్ సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ తో స‌మావేశం అయ్యారు.

అత్యంత స్ప‌ష్ట‌మైన‌, నిర్దిష్ట‌మైన స‌పోర్ట్ ప్ర‌క‌టించ‌డంపై ధ‌న్య‌వాదాలు తెలిపారు జై శంక‌ర్(Jai Shankar). వ‌ర‌ల్డ్ వైడ్ గా ఉగ్ర‌వాదం ప‌లు దేశాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి దేశం టెర్ర‌రిజాన్ని కంట్రోల్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. డిసెంబ‌ర్ నెల లోపు ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో ప్ర‌స్తుతం భార‌త దేశం శాశ్వ‌త స‌భ్య‌త్వం కోసం ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఇందులో భాగంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు జై శంక‌ర్. అమెరికా చీఫ్ జో బైడెన్ భార‌త్ కు మొద‌టి నుంచీ స‌హాయ‌, స‌హ‌కారాలు అంద‌జేయ‌డంలో కీల‌కంగా మారార‌ని పేర్కొన్నారు.

Also Read : హిజాబ్ వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!