Rekha Naik : 18న హస్తం గూటికి రేఖా నాయక్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు రిజైన్
Rekha Naik : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు రేఖా నాయక్. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు మంచి పట్టుంది. తాజాగా తన పట్ల బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది. అంతే కాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగింది. ఒకానొక సమయంలో రేఖా నాయక్ కంటతడి పెట్టింది.
Rekha Naik Will Join in Congress
ఇదిలా ఉండగా అధికారంలో ఉన్న పార్టీలో తనకు స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించింది. తన అనుచరులు, శ్రేయోభిలాషులతో కీలక మీటింగ్ చేపట్టింది.
వారి సూచన మేరకు బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ సరైనదని , అందుకే తాను హస్తం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రేఖా నాయక్(Rekha Naik). ఇందుకు గాను ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 18న టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో తాను పార్టీ కండువా కప్పుకుంటానని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్.
ఇదిలా ఉండగా పార్టీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయి. దీంతో ఇప్పటి వరకు 119 సీట్లకు గాను 55 మందితో తొలి లిస్టును ప్రకటించింది.
Also Read : Congress Seniors : సీనియర్ల టికెట్లపై ఉత్కంఠ