Reliance Jio 5G Announces : 50 న‌గ‌రాల్లో జియో 5జీ సేవ‌లు

ఇక నుంచి అందుబాటులో నెట్ క‌నెక్టివిటీ

Reliance Jio 5G Announces : రిల‌య‌న్స్ జియో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. 50 న‌గ‌రాల్లో కొత్త‌గా 5జీ సేవ‌ల‌ను విస్త‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆయా న‌గ‌రాల‌లో జియో వినియోగ‌దారులు ఆఫ‌ర్ల‌తో పాటు అప‌రిమిత‌మైన అనుభ‌వాన్ని పొందుతార‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. 1జీబీపీఎస్ కంటే ఎక్కువ వేగంతో డేటా పొందుతార‌ని తెలిపారు.

ప్ర‌పంచంలోనే 5జీ ప‌రంగా చేస్తే అతి పెద్ద నెట్ వ‌ర్క్ క‌లిగి ఉన్న సంస్థ ఒక్క రిల‌య‌న్స్ కంపెనీ మాత్ర‌మేన‌ని పేర్కొంది. రిల‌య‌న్స్ జియో కంపెనీ మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న(Reliance Jio 5G Announces) చేసింది. దేశంలోని 17 రాష్ట్రాలలోని 50 భార‌తీయ న‌గ‌రాల‌లో 5జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకు వ‌స్తున్న‌ట్లు తెలిపింది.

వీట‌తో క‌లుపుకుంటే 184 న‌గ‌రాల‌కు విస్త‌రించిన‌ట్ల‌వుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. రిల‌య‌న్స్ జియో చాలా న‌గ‌రాల్లో 5జీ సేవ‌ల‌ను ప్రారంభించిన మొద‌టి ఏకైక ఆప‌రేట‌ర్ గా అవ‌త‌రించింద‌ని వెల్ల‌డించింది సంస్థ‌. న‌గ‌రాల ప‌రంగా చూస్తే ఏపీలో చిత్తూరు, క‌డ‌ప‌, న‌ర‌స‌రావుపేట, ఒంగోలు , రాజ‌మ‌హేంద్ర వ‌రం, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం న‌గ‌రాలు ఉన్నాయి.

అస్సాంలోని నాగావ్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని భిలాస్ పూర్ , కోర్ఛా, రాజ్ నంద్ గావ్ లో 5జీ అందుబాటులోకి వ‌స్తుంది. గోవాలోని పనాజీ, హ‌ర్యానా లోని అంబాలా , బ‌హ‌దూర్ ఘ‌ర్ , హిసార్ , క‌ర్నాల్ , పానీప‌ట్, రోహ్త‌క్ , సిర్సా , సోనిప‌ట్ ల‌లో ప‌ని చేస్తుంది.

జార్ఖండ్ లోని ధ‌న్ బాద్ , క‌ర్ణాట‌క లోని బాగ‌ల్ కోటే, చిక్ మంగ‌ళూరు, హాసన్ న‌గ‌రాల‌లో 5జీ అందుబాటులో ఇక నుంచి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది రిల‌య‌న్స్ జియో కంపెనీ. దీని వ‌ల్ల మ‌రింత మెరుగైన క‌నెక్టివిటీ దొరుకుతుంది.

Also Read : జొమాటోలో కొలువుల మేళం

Leave A Reply

Your Email Id will not be published!