Reliance Jio 5G Launches : లాంఛనంగా రిలయన్స్ 5జీ సేవలు స్టార్ట్
ప్రధాన నగరాలలో త్వరలోనే అందుబాటులోకి
Reliance Jio 5G Launches : దేశ వ్యాప్తంగా ప్రధాన చర్చగా మారి పోయింది 5జీ సర్వీస్(Reliance Jio 5G Launches). ఇప్పటికే టెలికాం కంపెనీలన్నీ ఏర్పాట్లలో మునిగి పోయాయి. ప్రధాన పోటీ రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య నెలకొంది. మరో వైపు ఉపగ్రహం నుంచి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలనేది ఆయా సంస్థల ప్లాన్ .
ఇప్పటికే టెస్లా సంస్థకు చెందిన ఎలోన్ మస్క్(Elon Musk) ఆధ్వర్యంలో స్పేస్ ఎక్స్ ద్వారా నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. భారత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సదరు సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో పోటీ మరింత పెరిగేందుకు ఆస్కారం ఉంది.
ఈ తరుణంలో 5జీ సర్వీసులను అటు రిలయన్స్ జియో తో పాటు ఎయిర్ టెల్ కూడా ప్రారంభించాయి. వీటిని దేశ వ్యాప్తంగా మూరుమూల కేంద్రాలకు తీసుకు వెళ్లాలంటే దాదాపు ఇంకా వచ్చే ఏడాది అవుతుంది. భారీ ఎత్తున టవర్లన నిర్మాణం, 5జీ టెక్నాలజీ నైపుణ్యం కలిగిన సిబ్బంది, ఇతరత్రా కావాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఇండియాలో వినియోగదారుల పరంగా చూసుకుంటే రిలయన్స్ జియో టాప్ లో కొనసాగుతోంది. ఎయిర్ టెల్ రెండవ స్థానంలో కొనసాగుతుండగా మూడో స్థానంలో వొడా ఫోన్ ఐడియా ఉంది. ఇక బీఎస్ఎన్ ఎల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక 5జీ విషయానికి వస్తే శనివారం లాంఛనంగా రియలన్స్ జియో తన 5జీ సేవలను అధికారికంగా ప్రారంభించింది.
రాజస్థాన్ రాష్ట్రం రాజ్ సమంద్ లోని ప్రతిష్టాత్మకమైన శ్రీనాత్ జీ ఆలయంలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చేతుల మీదుగా 5జీ సేవలు స్టార్ట్ అయ్యాయి.
Also Read : దాన సంపన్నులు శివ నాడర్..ప్రేమ్ జీ