Jio Mart Lay Offs : జియో మార్ట్ లో భారీగా తొలగింపు
1500 మందికి కోలుకోలేని షాక్
Jio Mart Lay Offs : ప్రపంచ ఆర్థిక మాంద్యం దెబ్బకు ఏ కంపెనీలో ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి దాపురించింది. ఐటీ, ఫార్మా, టెలికాం, ఈ కామర్స్ , లాజిస్టిక్ , మీడియా..ఇలా ప్రతి రంగంలో పని చేస్తున్న వారంతా ఇంటి బాట పడుతున్నారు. తాజాగా దేశ వ్యాపర రంగంలో టాప్ లో కొనసాగుతున్న రిలయన్స్ గ్రూప్ సంస్థ సంచలన ప్రకటన చేసింది.
ఈ మేరకు తనకు చెందిన జియో మార్ట్(Jio Mart) లో 500 మంది ఎగ్జిక్యూటివ్ లతో పాటు 1,000 మంది వెళ్లి పోవాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఈ సమాచారం బయటకు పొక్కింది. ఓ వైపు ఆయా కంపెనీలు లాభాల్లో ఉన్నాయని ప్రకటిస్తున్నాయి. కానీ ఇదే సమయంలో భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
ఈ మేరకు జియో మార్ట్ కార్పొరేట్ కార్యాలయం నుంచి తొలగించాలంటూ స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అంతే కాదు దేశంలోని పలు కేంద్రాలలో సగానికి పైగా మూసి వేయాలని యోచిస్తున్నట్లు టాక్. మెట్రో క్యాష్ అండ్ క్యారీని కొనుగోలు చేసిన తర్వాత కార్యకలాపాలను క్రమబద్దీకరించే ప్రయత్నాల్లో భాగంగా జియో మార్ట్ భారీ ఎత్తున తొలగింపునకు శ్రీకారం చుట్టింది.
అంతే కాదు త్వరలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్ లైన్ హోల్ సేల్ ఫార్మాట్ లో పని చేస్తున్న వారిని మూడింట రెండు వంతుల మందిని సాగనంపాలని నిర్ణయించినట్లు సమాచారం.
Also Read : YS Sharmila
