Revanth Reddy : మేడిగ‌డ్డ ఘ‌ట‌న సీఎందే బాధ్య‌త‌

టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణ – మేడిగ‌డ్డ బ్యారేజ్ కుంగి పోయిన ఘ‌ట‌న‌కు పూర్తి బాధ్య‌త సీఎం కేసీఆర్ వ‌హించాల‌ని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పిల్ల‌ర్లు ఎందుకు కూలి పోయాయో చెప్పాల‌న్నారు. వెంట‌నే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జ‌డ్జిని నియ‌మించాల‌ని కోరారు టీపీసీసీ చీఫ్‌. త‌నిఖీ చేసేందుకు వెళ్లిన వారిని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాల‌న్నారు. ద‌మ్ముంటే భిల్లా రంగాలు విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని అన్నారు.

Revanth Reddy Slams CM KCR

నిన్న‌టి దాకా త‌మ నేతపై నోరు పారేసుకున్న స‌ర్కార్ ఇప్పుడు మేడిగ‌డ్డ బ్యారేజ్ కూలిన ఘ‌ట‌న గురించి ఎందుకు స్పందించడం లేదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ల‌క్షా 30 వేల కోట్ల‌ను నీళ్ల పాలు చేశారంటూ ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర్ రాజ‌న్ స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త లోపించ‌డం వ‌ల్ల‌నే మేడిగ‌డ్డ బ్యారేజ్ కూలి పోయింద‌ని ఆరోపించారు. ప్రాజెక్టు రీ-డిజైన్‌ చేశామని చెబుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు రేవంత్ రెడ్డి. పిల్లర్లను ధ్వంసం చేయడంతో అవినీతి అక్రమాలు బట్ట బయలు అయ్యాయని ఆరోపించారు.

Also Read : Priyanka Gandhi : పాల‌మూరుకు రానున్న ప్రియాంక‌

Leave A Reply

Your Email Id will not be published!