Revanth Reddy : ఖాకీల తీరుపై రేవంత్ కన్నెర్ర
పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోవడం కష్టం
Revanth Reddy : ఖమ్మంలో తమ పార్టీ తల పెట్టిన భారీ జన గర్జన సభకు జనాన్ని రాకుండా అడ్డు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అర చేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరని హెచ్చరించారు. ఆదివారం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఖమ్మంకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో కలిసి చర్చించారు. ఇప్పటికే సభ కోసం సీనియర్ నాయకులు చేరుకున్నారు. భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మాజీ పీసీసీ చీఫ్ వీహెచ్ హనుమంత రావు కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా తమను అడ్డు కోబోయిన పోలీసులపై నిప్పులు చెరిగారు రేణుకా , వీహెచ్. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుంటూ వెళ్లారు. ఈ సందర్బంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని అడ్డుకుంటోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి సభను నిర్వహించే హక్కు ఉంటుందున్నారు.
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ముందస్తు అరెస్ట్ చేస్తున్నారని, ఎక్కడికక్కడ చెక్ పోస్టుల పేరుతో వాహనాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతలు చెప్పినవన్నీ అబద్దాలేనని స్పష్టం చేశారు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్.
Also Read : CM Shinde : మాది ట్రిపుల్ ఇంజన్ సర్కార్