Revanth Reddy : తమకు న్యాయం చేయాలని, తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా తయారైందంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు – వీఆర్ఏ లు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు.
ధర్నా చౌక్ సాక్షిగా ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిస్కరించాలని లేక పోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు.
పేరుకే పార్ట్ టైమర్లమని కానీ ఫుల్ టైమ్ చేయించు కుంటున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన వీఆర్ఏ లకు బాసటగా నిలిచారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).
ఈ మేరకు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్ కు. ఇప్పటికైనా వీఆర్ఏ లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరారు.
లేక పోతే వారిని ఆదుకోక పోతే ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు. వారి పరిస్థితి దయనీయంగా తయారైందని, కట్టు బానిసల కన్నా హీనంగా మారిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎందుకు వారి పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ప్రశ్నించారు. కొన్నేళ్లుగా ప్రమోషన్లు లేక , చాలీ చాలని జీతాలతో వీఆర్ఏలు నెట్టుకొస్తున్నారంటూ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక వీఆర్ఏలు తీవ్రమైన రోగాలకు లోనవుతున్నారని తెలిపారు. కొందరు గుండె పోటుకు గురవుతున్నారంటూ వాపోయారు రేవంత్ రెడ్డి.
రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 23 వేల మంది వీఆర్ఏ లకు పేస్కేల్ ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారని ఈరోజు వరకు దానిని అమలు చేసిన దాఖలాలు లేవన్నారు.
Also Read : వివాద రహితుడు గౌతమ్ రెడ్డి