Revanth Reddy : రేవంత్ రెడ్డి సుడిగాలి ప్ర‌చారం

63 నియోజ‌క‌వ‌ర్గాలు..87 స‌భ‌లు

Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు పోటా పోటీగా క్యాంపెయిన్ చేశారు. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చారు. ఈసారి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అగ్ని ప‌రీక్ష‌గా మారాయి ఎన్నిక‌లు. ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందంజ‌లో నిలిచింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెన్సేష‌న్ గా మారారు. ఈ మొత్తం ప్ర‌చారంలో ఏకంగా 63 నియోజ‌క‌వ‌ర్గాలలో ప‌ర్య‌టించారు. 87 చోట్ల స‌భ‌లలో పాల్గొన్నారు. రోడ్ షోలలో ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

Revanth Reddy Meetings Viral

పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు, స్టార్ క్యాంపెయిన‌ర్లు జ‌ల్లెడ ప‌ట్టారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్ర‌చారం అక్టోబ‌ర్ 16న వికారాబాద్ లో స‌భ‌తో ప్రారంభ‌మైంది . న‌వంబ‌ర్ 28న మ‌ల్కాజ్ గిరి రోడ్ షోతో ముగించారు. ఆయా ప్రాంతాల ప‌రంగా చూస్తే వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్, కొడంగల్, కామారెడ్డి, గజ్వేల్, దుబ్బాక, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల లో జ‌రిగిన స‌భ‌ల్లో పాల్గొన్నారు.

ఇక మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జుక్కల్, ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, డోర్నకల్, ఎల్ బీ నగర్, మహేశ్వరం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, వర్ధన్నపేట, జనగాం, పాలకుర్తి, మేడ్చల్, అంబర్ పేట, మెదక్, సంగారెడ్డి, మానకొండూరు, హుజురాబాద్, రాజేంద్రనగర్, సనత్ నగర్, సికింద్రాబాద్ లో జ‌రిగిన స‌భ‌ల్లో ప్ర‌సంగించారు.

వీటితో పాటు నర్సాపూర్, వనపర్తి, నారాయణఖేడ్, ముషీరాబాద్, పఠాన్ చెరు, నారాయణపేట, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తి, రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, షాద్ నగర్, ఆర్మూర్ తదితర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు.

Also Read : Akunuri Murali : ఓట‌ర్ల సునామీలో బీఆర్ఎస్ గాయ‌బ్

Leave A Reply

Your Email Id will not be published!