Revanth Reddy : పవర్ లోకి వస్తే రైతులకు పండుగ
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy TS Congress : తాము పవర్ లోకి వస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు.
ప్రగతి భవన్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ప్రకృతిని మోసం చేసినోడు ఎన్నటికీ బాగు పడిన దాఖలాలు లేవన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy TS Congress). ఇప్పటికే నీళ్లు, ఇసుక, మద్యం అన్నింటినీ గంప గుత్తగా అమ్ముకున్న చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ లీడర్లు బకాసురులుగా మారి పోయారని ఆరోపించారు.
కబ్జాల పర్వం ఇంకా కొనసాగుతోందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ల జాతకాలు బయట పెడతామన్నారు. ఏ ఒక్కరు మిగలరని అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో అవినీతి చరిత్ర ఉందని , తీస్తే చాంతాడంత అవుతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ముందు జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.
వీరి కారణంగా ఇవాళ వనరులన్నీ ధ్వంసమై పోయామని, గుట్టలు, చెట్లు కూడా కనిపంచకుండా చేస్తున్నారని, పాలన పూర్తిగా స్తంభించి పోయిందని పూర్తిగా సర్కార్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. మానుకొండూరు వాగును చూసి తాను విస్తు పోయానని పేర్కొన్నారు. తాము వచ్చాక వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
Also Read : సీఎస్ ‘సుప్రీం’ అనుకుంటే ఎలా