Ricky Kej Grammy Award : రికీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డు

భారత్ కు చెందిన మ్యూజిక్ కంపోజ‌ర్

Ricky Kej Grammy Award : భార‌త దేశానికి చెంద‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రికీ కేజ్ కు గ్రామీ అవార్డు(Ricky Kej Grammy Award) ద‌క్కింది. ఈ గ్రామీ అవార్డును వ‌రుస‌గా మూడోసారి అందుకోవ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా భార‌త దేశం మ‌ళ్లీ గ‌ర్వ‌ప‌డేలా చేశారు రికీ కేజ్. ఇదిలా ఉండ‌గా రికీ కేజ్ బెంగళూరుకు చెందిన వ్య‌క్తి. రాక్ లెజెండ్ గా పేరుపొందారు. స్టీవ‌ర్ట్ కోప్ ల్యాండ్ త‌న ఇటీవ‌లి ఆల్బ‌మ్ డివైన్ టైడ్స్ కు ఉత్త‌మ లీన‌మ‌య్యే ఆడియో ఆల్బ‌మ్ గా గ్రామీని గెలుచుకున్నారు.

65వ గ్రామీ అవార్డుల్లో వరుసగా పుర‌స్కారం అందుకున్నారు రికీ కేజ్. ఫిబ్ర‌వ‌రి 6న జ‌రిగిన మ్యూజిక్ అవార్డు వేడుక‌ల్లో పుర‌స్కారాన్ని అందుకున్నారు రికీ కేజ్. యుఎస్ లో పుట్టిన సంగీత కారుడు బ్రిటీస్ రాక్ బ్యాండ్ ది పోలీస్ డ్ర‌మ్మ‌ర్ అయిన స్టీవ‌ర్ట్ కోప్ ల్యాండ్ తో డివైన్ టైడ్స్ కోసం ఆడియో ఆల్బ‌మ్ అవార్డును పంచుకున్నారు.

గ‌త ఏడాది ఇద్ద‌రూ ఇదే అవార్డును పంచుకున్నారు. డివైన్ టైడ్స్ అనేది తొమ్మిది పాట‌ల ఆల్బ‌మ్ .ఇది అంద‌రికీ స‌మానంగా సేవ‌లందించే స‌మ‌తుల్య‌త‌ను కాపాడు కోవ‌డంలో ప్ర‌తి వ్య‌క్తి జీవితం ఎలా కీల‌క పాత్ర పోషిస్తుందో అన్వేషిస్తుంది. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బ‌మ్ విభాగంలో రికీ కేజ్ త‌న ఆల్బ‌మ్ విండ్స్ ఆఫ్ సంసార కోసం 2015లో త‌న మొద‌టి గ్రామీ అవార్డును(Ricky Kej Grammy Award) గెలుపొందారు.

ది పోలీస్ తో త‌న ప‌నిలో భాగంగా కోప్ ల్యాండ్ ఐదు గ్రామీల‌ను గెలుచుకున్నాడు. కేజ్ తో ఇది రెండ‌వ అవార్డు. ట్రైవ‌ర్ నోహి లాస్ ఏంజిల్స్ లోని జ‌రిగిన వేడుక‌కు హోస్ట్ గా తిరిగి వ‌చ్చాడు.

Also Read : ముంబై ఇండియ‌న్స్ మెంటార్ గా ‘గోస్వామి’

Leave A Reply

Your Email Id will not be published!