Ricky kej Modi : మోదీ ఆత్మ విశ్వాసం అద్భుతం

విస్తు పోయిన గ్రామీ అవార్డు విన్న‌ర్

Ricky kej Modi : ప్ర‌పంచంలో అత్యుత్త‌మ నాయ‌కుల‌లో టాప్ లో ఉంటూ వ‌స్తున్నారు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నా లీడ‌ర్ గా వంద మార్కులు సాధిస్తూ వ‌స్తున్నారు.

ప్ర‌పంచంలో ఏ దేశాధినేత సోష‌ల్ మీడియాను మోదీ వాడుకున్నంత‌గా ఎవ‌రూ వాడుకోరు. ఆయ‌న శ‌త్రువుల‌ను సైతం అభినందిస్తారు. ప్ర‌ధానంగా ఆట‌గాళ్ల‌ను ప్రోత్స‌హించే తీరు గొప్ప‌గా ఉంటుంది.

మోదీకి దేశాభిమానంతో పాటు సంగీతం అంటే ఇష్టం. ఇటీవ‌ల గాన కోకిల ల‌తా మంగేష్క‌ర్ చ‌ని పోయింద‌న్న విష‌యం తెలియ‌గానే క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.

ఆమె అంత్య‌క్రియ‌ల‌కు స్వ‌యంగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న ప్రోటోకాల్ ను కూడా ప‌క్క‌న పెట్టారు. ఇక తాజాగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది.

అదేమిటంటే ప్ర‌పంచంలో టాప్ అవార్డుగా ప‌రిగ‌ణించే గ్రామీ అవార్డు విజేత అయిన బెంగ‌ళూరుకు చెందిన సంగీత స్వ‌ర‌కర్త రీకే కేజ్(Ricky kej Modi) ప్ర‌ధాన మంత్రి మోదీని క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మోదీని చూసి విస్మ‌యానికి లోన‌య్యారు. ఆయ‌న ఏడు సంవ‌త్స‌రాల కింద‌ట ఇదే ప్ర‌ధాన మంత్రి మోదీని క‌లుసుకున్నారు.

ఆనాడు అవార్డు పొందిన సంద‌ర్భంగా. సుదీర్గ కాలం త‌ర్వాత కూడా మ‌ళ్లీ క‌లుసుకున్న ఈ స్వ‌ర‌క‌ర్త‌ను విస్తు పోయేలా చేసింది మాత్రం మోదీ ముఖార‌విందం. ఆత్మ‌విశ్వాసం.

7 ఏళ్ల కింద‌ట ప్ర‌ధాని ఎలా ఉన్నారో ఏడేళ్ల త‌ర్వాత కూడా సేమ్ అలాగే ఉన్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మోదీని మీ ర‌హ‌స్యం ఏంటి స‌ర్ అని అడ‌గ‌డం విశేషం. ఇందుకు ప్ర‌ధాని నుంచి వ‌చ్చిన స‌మాధానం చిరున‌వ్వు..అభినంద‌న‌.

Also Read : గ్రాండ్ గా ఆలియా ర‌ణ్ బీర్ పెళ్లి

Leave A Reply

Your Email Id will not be published!