Ricky Ponting : రిషబ్ పంత్ కు కోచ్ పాంటింగ్ సపోర్ట్
అతడిని నిందించాల్సిన పని లేదు
Ricky Ponting : ఐపీఎల్ 2022లో కీలకమైన మ్యాచ్ లో గెలుపొందాల్సిన సమయంలో చేజేతులారా ఓటమి పాలైంది రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు. ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్, సరైన సమయంలో డీఆర్ఎస్ అడగక పోవడంతో పాటు ఈ మొత్తం ఓటమికి ప్రధాన కారణం ఎవరో కాదు జట్టు కెప్టెన్ పంత్ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలపై నీళ్లు చల్లిన ముంబై ఆటగాడు టిమ్ డేవిడ్ విషయంలో చేసిన తప్పు, సులభంగా వచ్చిన క్యాచ్ ను వదిలేయడం కూడా పంత్ పై తాజా, మాజీ ఆటగాళ్లు, ఢిల్లీ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
దీంతో హెడ్ కోచ్, ఆసిస్ మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్(Ricky Ponting) పంత్ కు బాసటగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ తప్పుకున్నాక ఢిల్లీ క్యాపిటల్స్ బాధ్యతలు భుజాన వేసుకున్న రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడని కితాబు ఇచ్చాడు.
అంతే కాదు బయటి నుంచి చూసే వారికి అంతా సులభంగా కనిపిస్తుందని కానీ మైదానంలో సీన్ వేరుగా ఉంటుందన్నాడు. విపరీతమైన ఒత్తిళ్ల మధ్య కెప్టెన్సీ నిర్వహించాల్సి ఉంటుందన్నాడు.
దుబాయ్ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ నుంచి నేడు ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 దాకా పంత్ నాయకత్వం బాగానే ఉందంటూ స్పష్టం చేశాడు రికీ పాంటింగ్.
పంత్ రైట్ ఛాయిస్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ప్రధానంగా తమ జట్టు ఓడి పోవడానికి ప్రధాన కారణం ఏమిటో క్లారిటీ ఇచ్చాడు పాంటింగ్(Ricky Ponting).
అదేమిటంటే టాప్ ఆర్డర్ సరిగా ఆడక పోవడం వల్లే తాము పరాజయం పాలయ్యామని పేర్కొన్నాడు. మొత్తంగా ముంబై కొట్టిన దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్(DC) ఇంటి బాట పట్టగా ఆర్సీబీ (Royal Challengers Bangalore) ప్లే ఆఫ్స్ కు చేరింది. సంబురాల్లో మునిగి తేలుతోంది.
Also Read : ముంబై విజయం బెంగళూరు సంబురం