Ricky Ponting : ఆ ఇద్దరూ అద్భుతమైన ఫినిషర్స్
రికీ పాంటింగ్ సంచలన కామెంట్స్
Ricky Ponting : త్వరలోనే ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ తలపట్టుకుంటోంది. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఇదే సమయంలో ఊహించని రీతిలో భారత జట్టులో చోటు కోసం యువ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు.
ఎవరిని తీయాలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై బీసీసీఐ సెలెక్టర్లు తలలు బాదుకుంటన్నారు. ఇక వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టుకు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పిచ్ లకు బాగా అలవాటు పడిన ఆటగాళ్లు అయితే బెటర్ అని తాజా, మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. తాజాగా ఆసిస్ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్(Ricky Ponting) సంచలన కామెంట్స్ చేశాడు.
ఆ ఇద్దరు క్రికెటర్ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ తో పాటు దినేష్ కార్తీక్ , పాండ్యా ఇద్దరూ ఉంటే భారత జట్టును ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కష్టమవుతందని పేర్కొన్నాడు.
డీకే, పాండ్యాలు అద్భుతమైన ఫినిషర్స్ అంటూ కితాబు ఇచ్చాడు పాంటింగ్. అంతే కాకుండా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ గనుక పంత్ తో కలిస్తే పరుగుల వరద పారించ వచ్చని అభిప్రాయ పడ్డాడు.
ఒకరిని మించి మరొకరు అద్భుతంగా ఆడుతున్నారు. మరో వైపు పేలవమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి చాన్స్ దక్కుతుందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది.
సూర్య కుమార్ , అయ్యర్ ల మధ్య పోటీ ఉంటుందన్నాడు పాంటింగ్. ఇదిలా ఉండగా భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అయితే స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ ను తప్పక తీసుకోవాలని సూచించాడు.
పైకి వచ్చే బంతుల్ని ఎదుర్కొని పరుగులు రాబట్టడంలో కీలకంగా ఉంటాడన్నాడు.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ లో దాయాదుల పోరు