Ricky Ponting : ఆ ఇద్దరు టీమిండియాకు అవసరం
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్
Ricky Ponting : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ , కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరగనుంది. పాల్గొనే భారత జట్టు ఎలా ఉండాలనే దానిపై స్పందించాడు.
ఇద్దరు ఆటగాళ్లు తప్పనిసరిగా టీమిండియాలో ఉండాలని స్పష్టం చేశాడు. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు రిషబ్ పంత్ మరొకరు దినేష్ కార్తీక్ అని పేర్కొన్నాడు రికీ పాంటింగ్(Ricky Ponting).
వీరు ఫుల్ ఫామ్ లో ఉన్నారని వారిని గనుక తీసుకుంటే భారత జట్టుకు ఎదురే లేదని స్పష్టం చేశాడు. ఇద్దరూ వికెట్ కీపర్లుగా, బ్యాటర్లుగా పనికి వస్తారని తెలిపాడు.
ఒకవేళ పంత్ మొదట వస్తే ఫినిషర్ గా దినేష్ కార్తీక్ ఎంట్రీ ఇస్తాడని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లని, వారిని తప్పనిసరిగా ఎంపిక చేయాలని సూచించాడు పాంటింగ్.
అంతర్జాతీయ క్రికెట్ లో పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక దినేష్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఐపీఎల్ లో ఆడి సత్తా చాటాడు. ఓ వైపు కామెంటేటర్ గా ఉన్న కార్తీక్ క్రికెట్ మీద ఉన్న ప్రేమతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇది ఒక రకంగా ఎవరూ ఊహించని ట్విస్ట్. ఇక శ్రేయాస్ అయ్యర్ , ఇషాన్ కిషన్ వంటి వారి కంటే పంత్, డీకేను తీసుకోవడం జట్టుకు మేలు జరుగుతుందన్నాడు రికీ పాంటింగ్(Ricky Ponting).
ప్రస్తుతం భారత జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో పంత్ , డీకే ఉన్నారని పేర్కొన్నాడు. కానీ రికీ పాంటింగ్ కు సంజూ శాంసన్ మాత్రం గుర్తుకు రాక పోవడం ఆశ్చర్యం.
Also Read : హైదరాబాద్ కు బీసీసీఐ గుడ్ న్యూస్