Rinku Singh : అబ్బా రింకూ సింగ్ దెబ్బ
ఐపీఎల్ లో అరుదైన రికార్డ్
Rinku Singh : ఐపీఎల్ లో అసాధారణమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన రింకూ సింగ్. ఒకానొక దశలో కోల్ కతా ఆశలు వదులుకుంది. కానీ రింకూ సింగ్ రూపంలో అది తప్పని తేలింది. అహ్మదాబాద్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించాడు. తనకు ఎదురే లేదని చాటాడు. భారీ టార్గెట్ ను అవలీలగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. కోల్ కతా కు ఇది చిరస్మరణీయమైన విజయంగా నిలిచి పోతుంది. అంతే కాదు ఇండియన్ ప్రీమీయర్ హిస్టరీలో కూడా రింకూ సింగ్ ఆడిన మారథాన్ ఇన్నింగ్స్ ను ఎవరూ మరిచి పోలేరు.
మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది గుజరాత్. వరుస విజయాలతో ఊపు మీదున్న గుజరాత్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 204 రన్స్ చేసింది. అంతా అనుకున్నారు గుజరాత్ గెలుస్తుందని. కానీ చివరకు కోల్ కతా నైట్ రైడర్స్ జెండా ఎగుర వేసింది. చివరి ఓవర్ లో రింకూ సింగ్(Rinku Singh) చెలరేగాడు. యశ్ దయాల్ ఓవర్ లో వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. నమ్మ శక్యం కాని రీతిలో ఆడాడు.
3 వికెట్లతో సంచలన విజయం నమోదు చేసింది. రింకూ సింగ్ తో పాటు వెంకటేశ్ అయ్యర్ దుమ్ము రేపాడు. కేవలం 40 బంతులు ఎదుర్కొని 83 రన్స్ చేశాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రింకూ సింగ్ కేవలం 21 బాల్స్ ఎదుర్కొని 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరికి తోడు కెప్టెన్ నితీశ్ రాణా సైతం రాణించాడు. 45 పరుగులు చేశాడు. మరో వైపు రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించాడు. ఐపీఎల్ లో రికార్డ్ సృష్టించాడు.
Also Read : రషీద్ ఖాన్ తొలి హ్యాట్రిక్