Rishab Pant : తన బ్యాటింగ్ తో కంగారు బౌలర్లకు వణుకు పుట్టించిన రిషబ్ పంత్

మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూపించాడు పంత్. కంగారూ బౌలర్లను కనికరం లేకుండా శిక్షించాడు...

Rishab Pant : సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు స్టన్నింగ్ బౌలింగ్‌తో భయపెడుతున్న మూమెంట్ అది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడతాడనుకుంటే క్రీజులో సెట్ అయ్యాక బౌల్డ్ అయ్యాడు. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ కూడా అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. గంపెడాశలు పెట్టుకున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 6 పరుగులే చేసి మళ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పించ్ హిట్టర్ రిషబ్ పంత్(Rishab Pant) విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు. సింగిల్స్ తీయడమే కష్టంగా మారిన పిచ్ మీద నీళ్లు తాగినంత ఈజీగా సిక్సుల వర్షం కురిపించాడు.

Rishab Pant Game..

మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూపించాడు పంత్(Rishab Pant). కంగారూ బౌలర్లను కనికరం లేకుండా శిక్షించాడు. భారీ షాట్లతో వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో టెస్టులను టీ20లుగా మార్చేశాడు. 33 బంతుల్లోనే 6 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 61 పరుగులు చేశాడు. బోలాండ్ సహా కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో అటాకింగ్‌కు దిగి.. భారీ షాట్లు బాదాడు. 184 స్ట్రైక్ రేట్‌తో ఆడాడంటేనే అతడి బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బంతి అనూహ్యంగా బౌన్స్, స్వింగ్ అవుతున్నా పట్టించుకోకుండా తనదైన స్టైల్‌లో ర్యాంప్ షాట్లు, స్కూప్ షాట్లు, రివర్స్ స్వీప్స్ కొడుతూ ఆతిథ్య జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు.

సిడ్నీ పిచ్ మీద వికెట్ ఆపుదామని కంట్రోల్డ్‌గా, డిఫెన్సివ్‌గా ఆడితే వర్కౌట్ కావడం లేదు. బంతులు వృథా తప్ప స్కోరు బోర్డు మీదకు పరుగులు చేరడం లేదు. అలాగని షాట్లు ఆడదామంటే వికెట్లు పోతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో అతి జాగ్రత్తకు పోయి స్టార్క్, బోలాండ్ బంతులకు గాయాలపాలయ్యాడు పంత్. దీంతో ఈ అప్రోచ్ పనికిరాదని మేనేజ్‌మెంట్ అతడికి లైసెన్స్ ఇచ్చింది. తనదైన స్టైల్‌లో డిఫరెంట్ షాట్లతో విరుచుకుపడు, వికెట్లు పోయినా ఫర్వాలేదంటూ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దీంతో ఆసీస్ బెండు తీశాడు పంత్. భారీ షాట్లతో వాళ్లను ఊచకోత కోశాడు. అతడే ఈ ఇన్నింగ్స్ ఆడకపోతే 100 లోపే భారత్ చుట్టేసేది. అతడి కారణంగా 141 వరకు వెళ్లగలిగింది. జడేజా (8 నాటౌట్), సుందర్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లు ఎంత ఎక్కువ సేపు ఆడతారనే దాని మీదే భారత్ భారీ స్కోరు అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

Also Read : Minister Kishan Reddy : తెలుగు భాషను చిన్న చూపు చూడటం పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!