Liz Truss : ప్రధానిగా రిషి విజయం సాధించాలి – లిజ్ ట్రస్
బ్రిటన్ పీఎంకు అభినందనలు
Liz Truss : బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా ఎన్నికైన భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ కు(Rishi Sunak) ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేశారు ప్రస్తుత పీఎం లిజ్ ట్రస్. ఆమె కేవలం 45 రోజుల పాటు మాత్రమే ప్రధానిగా పని చేశారు. ఈ సమయంలో బ్రిటన్ దేశానికి కొన్నేళ్ల పాటు రాణిగా కొలువు తీరిన ఎలిజబెత్ -2 ఇటీవలే కన్ను మూశారు.
యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసింది. ఇక కొత్తగా దేశానికి కింగ్ గా ఎలిజబెత్ తనయుడు కింగ్ చార్లెస్ కొలువు తీరారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి గా ఎన్నికైన రిషి సునక్ మంగళవారం మర్యాద పూర్వకంగా బకింగ్ హోమ్ ప్యాలెస్ కు స్వయంగా వెళ్లారు. కింగ్ చార్లెస్ ను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా పీఎంగా రిషి సునక్ ఉండాలంటే కింగ్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ మేరకు కింగ్ చార్లెస్ సంతకం చేస్తారు. అంతకు ముందు ప్రస్తుత ప్రధాని లిజ్ ట్రస్(Liz Truss) జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి ప్రకాశవంతమైన రోజులు రానున్నాయని అన్నారు. రిషి సునక్ కు మంచి భవిష్యత్తు ఉందని, దేశ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు.
కొన్ని అనివార్య పరిస్థితుల్లో తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని, తనను మన్నించాలని అన్నారు లిజ్ ట్రస్. కాగా లండన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో చివరి సారిగా ప్రసంగం చేయడం విశేషం. పెద్ద ఎత్తున అనుచరులు, అభిమానులు, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సభ్యులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా కలిసి కట్టుగా సమన్వయంతో ముందుకు సాగాలని, దేశం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు కొత్తగా పీఎంగా కొలువు తీరిన రిషి సునక్.
Also Read : కింగ్ చార్లెస్ ను కలుసుకున్న ‘సునక్’