Barak Obama : ఒబామాను గుర్తుకు తెచ్చిన సున‌క్

ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త చంద‌రానా

Barak Obama : భార‌తీయ సంత‌తికి చెందిన రిషి సున‌క్ బ్రిట‌న్ కు ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. 200 ఏళ్ల చ‌రిత్ర‌లో ఒక హిందువు, భార‌తీయ మూలాలు క‌లిగిన వ్య‌క్తి ఇంత వ‌ర‌కు ఎవ‌రూ పీఎం కాలేక పోయారు. భార‌త దేశాన్ని పాలించిన ఆంగ్లేయులకు ఇది ఒక ర‌కంగా న‌మ్మ శ‌క్యం కాని షాక్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదే విష‌యాన్ని భార‌త వ్యాపార‌వేత్త ఆనాటి బ్రిట‌న్ పీఎం విన్ స్ట‌న్ చ‌ర్చిల్ చేసిన కామెంట్స్ ను ఉద‌హ‌రించారు. భార‌తీయులు పాల‌కులుగా ప‌నికి

రారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు త‌ప్ప‌ని నిరూపించారు రిషి సున‌క్ అని పేర్కొన్నారు. అది వైర‌ల్ గా మారింది.

ఇదిలా ఉండ‌గా రిషి సున‌క్ కు ఫ్యామిలీ, భ‌క్తి అంటే అభిమానం. వీలు చిక్కిన ప్ర‌తి సారి ఆయ‌న ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. అక్క‌డ భ‌క్తుల‌కు

అన్న‌దానం చేస్తారు. అక్క‌డ ఏర్పాటు చేసిన గుడిని త‌న తాత తీర్చి దిద్దారు.

ఈ సంద‌ర్భంగా ఆల‌య నిర్వాహ‌కుల‌లో ఒక‌రైన చంద‌రానా అమెరికాలో ఒబామా(Barak Obama) ప్రెసిడెంట్ గా ఎన్నికైన క్ష‌ణాల‌ను మ‌ళ్లీ ఇవాళ రిషి సున‌క్ గుర్తుకు తెచ్చార‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా లండ‌న్ కు నైరుతి నుండి దాదాపు 110 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సౌతాంప్ట‌న్ లోని వైదిక్ సొసైటీ హిందూ దేవాల‌యాన్ని సున‌క్ తాత రాందాస్ సున‌క్ 1971లో స్థాపించారు. ఆయ‌న తండ్రి య‌ష్ 1980లో ట్ర‌స్టీగా త‌న అనుబంధాన్ని కొన‌సాగించారు.

ఇదిలా ఉండ‌గా రిషి సున‌క్ తాను పుట్టిన హాంప్ షైర్ న‌గ‌రంలోని ఆల‌యాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా సంద‌ర్శిస్తారు. ఆయ‌న చివ‌రిసారిగా జూలైలో సంద‌ర్శించారు.

ఆయ‌న కుటుంబం ప్ర‌తి ఏడాది చేసే ఆరాధాకుల‌కు భోజ‌నాన్ని అందించారు కూడా. ఆల‌య నిర్వాహ‌కుల‌లో ఒక‌రైన చంద‌రానా ఈ విష‌యాన్ని మొద‌టిసారిగా పంచుకున్నారు.

ఇది గ‌ర్వించ ద‌గిన క్ష‌ణం. ప్ర‌స్తుతం ఆల‌యం సంద‌డి చేస్తోంది. చాలా మంది రిషి సున‌క్ తో తాము తీసుకున్న ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అమెరికాలో

మొద‌టిసారి శ్వేత జాతీయుడు ప్రెసిడెంట్ గా ఎన్నిక‌య్యారు. ఆనాటి క్ష‌ణాల‌ను మ‌ళ్లీ గుర్తు చేశాడు రిషి సున‌క్(Rishi Sunak) అని పేర్కొన్నారు.

ఇక్క‌డ హిందువు బ్రిట‌న్ కు పీఎం కావ‌డం కూడా అలాంటి క్ష‌ణాల‌ను మైమ‌రిపించేలా చేస్తోంద‌ని చెప్పాడు. నిజ‌మే క‌దూ.

Also Read : ఐసీసీతో భాగ‌స్వామ్యం భార‌త్ ముఖ్యం

Leave A Reply

Your Email Id will not be published!