RK Roja Selvamani : విద్యా పరంగా ఏపీ నెంబర్ వన్
రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
RK Roja Selvamani : విద్యా పరంగా దేశంలోనే ఏపీ రాష్ట్రం నెంబర్ వన్ అని స్పష్టం చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. చిత్తూరు జిల్లా నగరి పట్టణ పరిధిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి ఆర్కే రోజా సెల్వమణి మాట్లాడారు.
RK Roja Selvamani Appreciates YS Jagan
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు , కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రెడిట్ అంతా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani). విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకు వచ్చారని తెలిపారు.
ప్రత్యేకించి ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చి దిద్దడం జరిగిందన్నారు. విద్యార్థులకు తోడ్పాటు ఇచ్చేందుకు కొత్త కోర్సులను కూడా తీసుకు వచ్చినట్లు తెలిపారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మేలు చేకూరుతోందని స్పష్టం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్న జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. విద్యా రంగం అభివృద్ది కోసం ఏపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు ఆర్కే రోజా.
Also Read : Chandrababu Naidu : సీఈసీని కలవనున్న బాబు