Rohini Acharya Comment : అవ‌య‌వ దానం ‘ఆమె’కు వంద‌నం

తండ్రి లాలూ రుణం తీర్చుకున్న త‌న‌య

Rohini Acharya Comment : ఆర్థిక సంబంధాల‌కే ప్ర‌యారిటీ ఇస్తున్న ఈ లోకంలో క‌న్న తండ్రికి ఏకంగా కిడ్నీని దానం చేసి త‌న రుణం తీర్చుకుంది రోహిణి ఆచార్య. మ‌హిళ‌లు పాలు ఇవ్వ‌డమే కాదు ప్రాణాలు పోయ‌గ‌ల‌ర‌ని మ‌రోసారి నిరూపించారు. ఆమె త‌న బాధ్య‌త‌ను నిర్వర్తించింది. వేలాది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింది.

ఈ రోహిణి ఆచార్య ఎవ‌రో కాదు ఆర్జేడీ చీఫ్ , బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కూతురు. ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువ రోజులు బ‌త‌క‌రు అని తేల్చారు. కానీ కిడ్నీల‌లో ఒక‌టి పాడైంద‌ని క‌నీసం బ‌త‌కాలంటే త‌న‌కు కిడ్నీ ఇవ్వాల‌ని సూచించారు వైద్యులు. వెంట‌నే త‌ను ప్రాణ‌పదంగా ప్రేమించిన క‌న్న తండ్రికి కిడ్నీ దానం చేసింది రోహిణి ఆచార్య‌(Rohini Acharya Comment).

ఆమె భార‌త దేశ చ‌రిత్ర‌లో అవ‌య‌వ దానం చేసేందుకు స్పూర్తిగా నిలిచారు. మార్గ‌ద‌ర్శ‌కంగా మారారు. ఇవాళ పేరెంట్స్ ను బ‌రువుగా భావించే వారు లేక పోలేదు. కానీ ఆమె తీసుకున్న నిర్ణ‌యం ఎంతో గొప్ప‌ది. అత్యంత సాహ‌సం కూడా. త‌న‌కు ప్రాణం పోసింది మా తండ్రి.

క‌నుక ఆయ‌న లేకుంటే మేం ఉండీ ఏం లాభం. మా పాపా (నాన్న‌) మ‌మ్మ‌ల్ని కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. ఎలాంటి లోటు రానివ్వ‌లేదు. ఏది కావాలంటే అది కొని ఇచ్చి ఇచ్చారు. ఒక తండ్రిగా కంటే మ‌మ్మ‌ల్ని ఒక స్నేహితుడిలాగా పెంచార‌ని అందుకే నా ప్రాణం పోయినా ప‌ర్వాలేదు. కానీ మా నాన్న ప‌దికాలాల పాటు బ‌తికి ఉండాల‌ని కోరుకుంది రోహిణి ఆచార్య‌(Rohini Acharya Comment).

ఇవాళ యావ‌త్ ప్ర‌పంచం ఆమె చేసిన ప‌నికి స‌లాం చేస్తోంది. ధైర్యంగా ముందుకు వ‌చ్చింది. కిడ్నీని దానం చేసింది. సింగ‌పూర్ లో ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా జ‌రిగింది. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కంట‌త‌డి పెట్టారు. త‌న బిడ్డ‌ను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు.

భార‌త దేశ రాజ‌కీయాల‌లో ఒక చ‌రిత్ర లాలూ. కానీ ఆయ‌న త‌న కోసం ..త‌న ప్రాణాలు నిలిపేందుకు త‌న ప్రాణాన్ని ప‌ణంగా పెట్టిన త‌న బిడ్డ‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రించారు. ఆమె ఎల్ల‌ప్ప‌టికీ చిర‌స్థాయిగా నిలిచి పోతుంది.

2002లో రోహిణి ఆచార్య సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ను పెళ్లి చేసుకుంది. కానీ ఏనాడూ వెలుగులోకి రాలేదు. కానీ ఒక్క‌సారిగా కిడ్నీ దానం ఇవ్వ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది. ముందు నుంచీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. సోద‌రుడు డిప్యూటీ సీఎం.

త‌ల్లి మాజీ సీఎం. త‌న తండ్రిని సీబీఐ ప్ర‌శ్నించ‌డాన్ని రోహిణి ఆచార్య త‌ప్పు ప‌ట్టింది. ఆయ‌న‌కు ఏమైనా అయితే తాను ఊరుకోనంటూ హెచ్చ‌రించింది. ఇలాంటి వాళ్లే దేశానికి కావాలి. యావ‌త్ మ‌హిళా లోకం రోహిణి ఆచార్య‌ను చూసి, ఆమె తీసుకున్న నిర్ణ‌యానికి, చేసిన అవ‌య‌వ దానానికి స‌లాం చేస్తోంది. తండ్రి రుణం తీర్చుకున్నందుకు రోహిణి ఆచార్య క‌ల‌కాలం బ‌త‌కాల‌ని కోరుకుందాం.

Also Read : క‌లల‌కు సాకారం స‌క్సెస్ కు సోపానం

Leave A Reply

Your Email Id will not be published!