Rohinton Nariman : కిరన్ రిజిజుపై నారీమన్ ఆగ్రహం
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
Rohinton Nariman : కొలీజియం వ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దేశ వ్యాప్తంగా. న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు పై నిప్పులు చెరిగారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫౌలీ నారీమన్(Rohinton Nariman) . 2021 ఆగస్టులో పదవీ విరమణ చేసేందుకు ముందు కొలీజియంలో భాగమై ఉన్నారు. న్యాయ వ్యవస్థను డై ట్రైబ్ అని పిలిచారు.
న్యాయ స్థానం తీర్పులను సరైనదా లేదా తప్పు అయినా అంగీకరించడం తన పరిమిత కర్తవ్యం అని న్యాయ శాఖ మంత్రికి గుర్తు చేశారు నారీమన్. ప్రాథమిక నిర్మాణ సిద్దాంతాన్ని ప్రశ్నించిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ ను కూడా ఏకి పారేశారు మాజీ ప్రధాన న్యాయయూర్తి.
కేంద్రం అనుసరిస్తున్న తీరు న్యాయ వ్యవస్థకు అత్యంత ప్రమాదమని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిస్పందించేందుకు 30 రోజుల గడువును సూచించారు. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. ప్రాథమిక అంశాలు ఉన్నాయని హామీ ఇస్తున్నట్లు తెలిపారు.
అమెరికా దేశంలో దీనికి సమానమైనది ఏదీ లేదు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న తర్వాత 144 ప్రకారం తీర్పును అనుసరించడం మీ కర్తవ్యమని స్పష్టం చేశారు రోహంటన్ ఫౌలీ నారీమన్(Rohinton Nariman) .
ప్రాథమిక నిర్మాణ సిద్దాంతాన్ని ప్రశ్నిస్తూ న్యాయ వ్యవస్థ దాని పరిమితులను తెలుసు కోవాలని సూచించారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టాన్ని కొట్టి వేయడం పార్లమెంటరీ సౌర్య భౌమాధికారానికి సంబంధించిన తీవ్రమైన రాజీ అని పేర్కొన్నారు.
Also Read : బహిష్కరణ సంస్కృతి ప్రమాదం – ఠాకూర్