Sanju Samson : రాహుల్ వస్తే శాంసన్ పై వేటు
రాహుల్ వైపు ద్రవిడ్..రోహిత్ చూపు
Sanju Samson : ఇప్పటికే బీసీసీఐ నిర్వాకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ భారత జట్టు హెడ్ కోచ్ రవి శాస్త్రి సంజూ శాంసన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. కనీసం ఇతర ఆటగాళ్ల మాదిరిగా శాంసన్ ఆడేందుకు 10 మ్యాచ్ లు ఇవ్వాలని సూచించాడు. అప్పుడే ఏ ప్లేయర్ అయినా సమర్థుడా కాదా అన్నది తేలుతుందన్నాడు.
Sanju Samson Issue
ప్రత్యేకించి కేరళ స్టార్ శాంసన్ విషయంలో బీసీసీఐ వివక్ష చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం విండీస్ టూర్ కు ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. గతంలో ఎన్నడూ లేనంతగా కూల్ గా ఉండే శాంసన్(Sanju Samson) ఒత్తిడికి లోనైనట్లు అనిపించింది. ఇది పక్కన పెడితే భారత దేశం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే ఫార్మాట్ , టి20 ఫార్మాట్ లో చక్కగా సరి పోతాడు శాంసన్.
కానీ ఎలాంటి స్ట్రైక్ రేట్ లేక పోయినా ముంబై లాబీయింగ్ గట్టిగానే పని చేస్తోందని అనిపిస్తోంది. రోహిత్ శర్మ కావాలని శాంసన్ ను పక్కన పెడుతున్నాడని, ఆయనకు తోడుగా ద్రవిడ్ కూడా తయారయ్యాడన్న విమర్శలు లేక పోలేదు. గాయపడి ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ గనుక కోలుకుంటే వెంటనే 15 మంది సభ్యులలో తప్పించేది శాంసన్ నేనని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
Also Read : Tamannaah Vijay : ‘సుర’ లాంటి సినిమా మళ్లీ చేయను