Rohit Sharma Record : హిట్ మ్యాన్ అరుదైన రికార్డ్

విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్

Rohit Sharma Record : భార‌త క్రికెట్ జ‌ట్టు అద్భుత విజ‌యాలు న‌మోదు చేస్తూ దూసుకు వెళుతోంది. ఈ ఏడాది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వ‌హించ‌నుంది. ఇప్ప‌టికే ఖ‌రారు కూడా చేసింది. ఇందులో భాగంగా వ‌న్డే ప‌రంగా టీమిండియా సూప‌ర్ స‌క్సెస్ అందుకుంటోంది.

ఇక సిక్స‌ర్ల మోత మోగించ‌డంలో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు భార‌త జ‌ట్టు కెప్టెన్ , హిట్ మ్యాన్ గా పేరొందిన రోహిత్ శ‌ర్మ‌. బౌల‌ర్ ఎవ‌రైనా స‌రే ఎంత‌టి స్పీడ్ లో వేసినా స‌రే వాటిని క‌ళ్లు చెదిరే లోపు సిక్స‌ర్లుగా మ‌ల్చ‌డంలో రోహిత్ శ‌ర్మ ఆరి తేరాడు.

న్యూజిలాండ్ తో ఇండోర్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ లో అద్భుత సెంచ‌రీ సాధించాడు. ఈ సంద‌ర్భంగా అరుదైన రికార్డు స్వంతం చేసుకున్నాడు. అత్య‌ధిక సిక్సులు కొట్టిన రెండో భార‌త జ‌ట్టు కెప్టెన్ గా చ‌రిత్ర సృష్టించాడు రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma Record). ఈ మ్యాచ్ కంటే ముందు 132 సిక్స‌ర్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు హిట్ మ్యాన్ .

చివ‌రి వ‌న్డే లో 6 సిక్స‌ర్లు కొట్టాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డును స‌మం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీ 138 సిక్స‌ర్లు కొట్టాడు. వాటిని రోహిత్ శ‌ర్మ స‌మం చేశాడు. మాజీ స్కిప్ప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ 211 సిక్స‌ర్ల‌తో టాప్ లో కొన‌సాగుతున్నాడు. ఇక భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ 61 సిక్స‌ర్ల‌తో ఐద‌వ స్థానంలో ఉన్నాడు.

Also Read : వ‌న్డే ర్యాంకింగ్స్ లో భార‌త్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!