Rohit Sharma : భారత జట్టు కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకునేందుకు వెనుకాడడు. జట్టు గెలుపు తప్పితే అతడికి వేరే ఆలోచన ఉండదు. గతంలో ఎన్నోసార్లు ఇది చూశాం. తాజాగా ఇది మరోమారు ప్రూవ్ అయింది. జట్టు కోసం భారీ త్యాగం చేశాడు రోహిత్(Rohit Sharma). తన కంటే టీమ్ విజయానికి ఏది ముఖ్యమో అదే చేశాడు. హిట్‌మ్యాన్ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలిస్తే ఎవ్వరైనా సరే ప్రశంసించకుండా ఉండలేరు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలని కదా అని అనకమానరు.
Rohit Sharma..
టీమ్ కోసం ఓపెనింగ్ పొజిషన్‌ను త్యాగం చేశాడు రోహిత్(Rohit Sharma). పెర్త్ టెస్ట్‌లో తన స్థానంలో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కేఎల్ రాహుల్‌కు అతడు అండగా నిలిచాడు. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు జతగా రాహుల్‌ను ఓపెనింగ్‌కు పంపాడు హిట్‌మ్యాన్. కొడుకు పుట్టడంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌కు రోహిత్ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో రాహుల్ ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌తో కలసి తొలి వికెట్‌కు ఏకంగా 201 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించాడు కేఎల్. దీంతో ఈ జోడీని మార్చొద్దని భావించాడు రోహిత్. అందుకే ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సేమ్ కాంబినేషన్ రిపీట్ చేశాడు.
జైస్వాల్-రాహుల్‌తోఓపెనింగ్ చేయించిన రోహిత్.. తాను మాత్రం నాలుగో పొజిషన్‌లో ఆడాడు. దీంతో అతడ్ని అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తాను రెగ్యులర్‌గా ఆడే ఓపెనింగ్ స్లాట్‌లో ఆడొచ్చు. అయినా టీమ్ కోసం సక్సెస్ కాంబోను మార్చొద్దనే ఉద్దేశంతో హిట్‌మ్యాన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు వచ్చి ఆడటం శుభపరిణామమని.. ఇలాంటి సెల్ఫ్‌లెస్ కెప్టెన్ ఉంటే టీమ్‌కు ఢోకా ఉండదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రికార్డులు, మైల్‌స్టోన్స్ పట్టించుకోకుండా టీమ్ కోసం వేగంగా పరుగులు చేసేందుకు రోహిత్ ప్రయత్నిస్తుంటాడని.. ఇప్పుడు ఓపెనింగ్ స్లాట్‌ను కూడా త్యాగం చేసి జట్టు కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమని మరోమారు నిరూపించాడని చెబుతున్నారు.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ చోరీకి పాల్పడిన తమిళనాడు వ్యక్తి