Rohit sharma : ఇది ముంబై జట్టేనా అన్న అనుమానం నెలకొంది. ఆ జట్టు ఐపీఎల్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఐపీఎల్ ప్రారంభమై 36 మ్యాచ్ లు పూర్తయ్యాయి.
ఇంకా 34 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. నిన్నటి దాకా టాప్ జట్టుగా పరిగణించిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు వరుసగా ఎనిమిది మ్యాచ్ లలో ఓడి పోవడం క్రికెట్ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది.
ఒకానొక సమయంలో ఆ జట్టు కంటిన్యూ గా విజయాలు నమోదు చేసింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ టాప్ వన్ జట్టుగా పేరొందింది. కానీ దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్స్ కు రాకుండానే ఓటమి పాలైంది.
కానీ కొన్ని మ్యాచ్ లలో విజయం సాధించి పరువు పోకుండా కాపాడుకుంది. కానీ ఈఈసారి ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో మాత్రం అత్యంత దారుణమైన, చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచింది.
వరుసగా ఓటమి పాలు కావడంతో ఇక ప్లే ఆఫ్స్ కు ఆ జట్టు వెళ్లడం కష్టం. ఇప్పటికే అనామక జట్లు అనుకున్న టీమ్ లన్నీ సత్తా చాటుతూ నువ్వా నేనా అన్న రీతిలో తల పడుతున్నాయి.
గుజరాత్ టైటాన్స్ , లక్నో , రాజస్తాన్, బెంగళూరు, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఏ జట్లు వస్తాయో చెప్పలేనంతగా పోటీ నెలకొంది.
కానీ ముంబై మాత్రం తనకేమీ పట్టనట్టు తాపీగా ఆడుతూ పోతోంది. కేవలం ఓడి పోయేందుకు మాత్రమే ఆడుతున్నట్లుగా ఉంది. దీనికంతటికీ ప్రధాన కారణం కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma ).
అడపా దడపా ఆడినా జట్టును గట్టెక్కించ లేక పోయాడు. రోహిత్ ఉన్నట్టా లేనట్టా అని అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : జట్టులో కంటే ఐపీఎల్ పైనే ఫోకస్