Rohit Sharma : ఐపీఎల్ టోర్నీలో భాగంగా లీగ్ మ్యాచ్ లో లక్నో సెయింట్ జాయింట్స్ తో 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్ . ఐపీఎల్ టైటిళ్లను ముంబై ఐదుసార్లు కైవసం చేసుకుంది.
కానీ 168 పరుగుల టార్గెట్ ను 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే చేతులెత్తేసింది. వరుసగా ఇది ఎనిమిదో ఓటమి. రోహిత్ శఱ్మ 31 బంతులు ఆడి 39 రన్స్ చేశాడు. కెప్టెన్ తో పాటు కీరన్ పొలార్డ్ 19 పరుగులు చేశాడు.
ముంబై ఇండియన్స్ సీన్ మారడం లేదు. మైదానంలోకి వచ్చే సరికల్లా కేవలం అపజయం సాధించేందుకే ఆడుతున్నట్లు అనిపిస్తోంది. హెడ్ కోచ్ మహేళ జయవర్దెనే సైతం ఎన్నో వ్యూహాలు పన్నినా ముంబై జట్టులో మార్పు కనిపించడం లేదు.
స్వంత స్థలంలో ఐపీఎల్ 2022 కు ఆతిథ్యం ఇస్తోంది. టోర్నీలో వరుస ఓటములతో తీవ్ర నిరాశకు లోనవుతోంది. లక్నోతో పరాజయం అనంతరం మాట్లాడాడు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ(Rohit Sharma ).
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనవసరమైన షాట్స్ ఆడడం వల్లనే గెలవలేక పోయామని, వికెట్లను పారేసుకున్నామని వాపోయాడు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో తాము పరాజయం పాలు కావడం బాధకు గురి చేస్తోందన్నారు రోహిత్ శర్మ. ప్రత్యర్థి జట్టును సైతం ప్రత్యేకంగా అభినందించాడు. కేఎల్ రాహుల్ బాగా ఆడాడని పేర్కొన్నాడు.
బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణించారని, పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశామన్నాడు. కానీ బ్యాటింగ్ పరంగా తాము ఆశించినంతగా ఆడలేదన్నాడు రోహిత్ శర్మ.
Also Read : ఆగని ముంబై పరాజయ పరంపర