Roshan Mahanama : ప్ర‌జ‌ల ఆక‌లి తీరుస్తున్న రోష‌న్ మ‌హ‌నామా

టీలు, బ్రెడ్డు ప్యాకెట్లు స్వ‌త‌హాగా అంద‌జేత‌

Roshan Mahanama : శ్రీ‌లంక తీవ్రమైన ఆర్థిక‌, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1948లో స్వాతంత్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎప్పుడూ లేని రీతిలో తీవ్ర‌మైన ఆక‌లితో అల్లాడుతున్నారు ఆ దేశ ప్ర‌జ‌లు.

ప్ర‌త్యేకంగా ఆహారం, మందులు, ఇంధ‌నం దొర‌క‌క నానా తంటాలు ప‌డుతున్నారు. జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చారు. చిన్నారులు, వృద్దులు, మ‌హిళ‌లు అన్న‌మో రామ‌చంద్ర అంటున్నారు.

రికార్డు స్థాయిలో ద్ర‌వ్యోల్బ‌ణంతో త‌ల్ల‌డిల్లుతోంది శ్రీ‌లంక‌. దేశ అధ్య‌క్షుడు రాజ‌ప‌క్స రాజీనామా చేయాలంటూ నిర‌స‌న‌లు మిన్నంటాయి.

ఈ త‌రుణంలో ఆ దేశంలో త‌మ‌ని దేవుళ్లుగా ఆరాధించే క్రికెట‌ర్లు తమ మాన‌వ‌త‌ను చాటుకుంటున్నారు. తాజాగా శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ సెలెక్ట‌ర్ , శ్రీ‌లంక కోచ్ గా ప‌ని చేసిన రోష‌న్ మ‌హ‌నామా(Roshan Mahanama) ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు.

మాన‌వ‌త‌ను చాటుకుంటున్నారు. 1996లో ప్ర‌పంచ క‌ప్ సాధించిన శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్టులో రోష‌న్ మ‌హ‌నామా ఒక‌రు. ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగారు.

పెట్రోల్ బంకు వ‌ద్ద వ‌రుసలో ఉన్న ప్ర‌జ‌ల‌కు టీ (చాయ్ ), బ్రెడ్లు అందిస్తున్నారు. వారి ఆక‌లిని తీరుస్తున్నారు. దీంతో వీటి కోసం రోజు రోజుకు క్యూలు పెరిగి పోతున్నాయి.

ఇది త‌న‌ను మ‌రింత బాధ పెట్టింద‌ని పేర్కొన్నారు. మ‌హ‌నామా. ఇందులో గంట‌ల త‌ర‌బ‌డి నిల్చున్న వారిలో కొంద‌రు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో పంచుకున్నారు రోష‌న్ మ‌హ‌నామా(Roshan Mahanama). ద‌య‌చేసి సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు మాజీ క్రికెట‌ర్. త‌న‌కు చేత‌నైనంత వ‌ర‌కు స‌హాయం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు.

Also Read : లంకకు చేరుకున్న‌ మ‌హిళా క్రికెట్

Leave A Reply

Your Email Id will not be published!