Ross Taylor : జూలో పులులున్నా ద్రవిడ్ పైనే ఫోకస్
కీవీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ కామెంట్స్
Ross Taylor : న్యూజిలాండ్ స్టార్ దిగ్గజం రాస్ టేలర్(Ross Taylor) బ్లాక్ అండ్ వైట్ పేరుతో ఆత్మకథ రాశాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆ పుస్తకం జనాదరణ చూరగొంటోంది. ఒక రకంగా చెప్పాలంటే కుండ బద్దలు కొడుతూ అన్ని విషయాలు పంచుకున్నాడు.
రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే పుస్తకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి క్రికెట్ ఆటలో ఎలా రేసిజం (జాత్యహంకారం ) ఉంటుందో , తాను దానిని ఎలా ఎదుర్కొన్నాడో చెప్పాడు.
తాజాగా ఇందులో మరో విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు రాస్ టేలర్. మేం ఆట సందర్బంగా జూ పార్క్ కు వెళ్లాం. ఆ అడవిలో 4 వేలకు పైగా పులులు ఉన్నాయి.
కానీ వాటిని చూడాలంటే భయం వేసింది నాకు. నాతో పాటు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కూడా ఉన్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన వాళ్లంతా పులులను చూడడం మానేశారు.
కేవలం ఒక్కరిపైనే ఫోకస్ పెట్టారు. అతడు ఎవరో కాదు ప్రపంచ వ్యాప్తంగా జెంటిల్ మెన్ గా పేరొందిన ది వాల్ రాహుల్ ద్రవిడ్ అని పేర్కొన్నాడు.
ఈ ఘటన రణతంబోర్ నేషనల్ పార్క్ కి వెళ్లిన సంఘటన గుర్తు చేశాడు. సాధారణ ప్రజలు పులిని గుర్తించడం కంటే ఆయనతో ఉండేందుకు ఉత్సుకత చూపించారంటూ పేర్కొనడం ఇప్పుడు క్రికెట్ రంగంలో చర్చకు దారి తీసింది.
ఐపీఎల్(IPL) లో భారత్ తో ఇతర దేశాల ఆటగాళ్లు కలిసి పోవడం పరిపాటిగా మారింది. ఎందుకంటే వారు కూడా ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read : కెప్టెన్సీ మార్పుపై సబా కరీం ఫైర్