Rovman Powell : ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఏదీ కలిసి రాలేదు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో ఒక్క పూరన్ మెరుపులు తప్ప ఇంకెవరూ ఆకట్టు కోలేక పోయారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బరిలోకి దిగిన సన్ రైజర్స్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇక బ్యాటింగ్ లో దుమ్ము రేపారు ఆసిస్ స్టార్ డేవిడ్ వార్నర్ , విండీస్ స్టార్ ఆటగాడు రోవ్ మన్ పావెల్. క్రీజులో ఉన్నంత సేపు బంతుల్ని బౌండరీ లైన్లు దాటించారు వీరిద్దరూ. పావెల్(Rovman Powell ) అయితే శివమెత్తినట్లు ఆడాడు.
వార్నర్ 12 ఫోర్లు 3 సిక్సర్లు కొడితే రోవ్ మన్ పావెల్ (Rovman Powell )35 బంతులు మాత్రమే ఎదుర్కొని 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్లు, సిక్సర్లతో 48 పరుగులు వచ్చాయి.
సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు పావెల్. ప్రధానంగా స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు తన బ్యాట్ తో పని చెప్పాడు. ఈ సందర్భంగా తనను 5వ నెంబర్ లో పంపించమని, తన సత్తా ఏమిటో చూపిస్తానని కెప్టెన్ పంత్ తో చెప్పానని అన్నాడు రోవెన్.
అటు స్పిన్ తో పాటు ఇటు పేస్ ను కూడా ఎదుర్కోగలనని పేర్కొన్నాడు. ఎస్ ఆర్ హెచ్ తో ఆడక ముందు 135 రన్స్ మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత రెచ్చి పోయాడు. జట్టును ఒప్పించేందుకు ఇబ్బంది పడ్డానని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా డేవిడ్ వార్నర్ , రోవ్ మన్ పావెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చారు.
Also Read : కోహ్లీ ఆట తీరుపై బిషప్ కామెంట్