RR Batting Qualifier2 : బ్యాటింగ్ లో విధ్వంసం దక్కేనా విజయం
రాజస్తాన్ రాయల్స్ కు అంతా హిట్టర్లే
RR Batting Qualifier2 : ఐపీఎల్ 2022 టైటిల్ ఫైనల్ కు చేరేందుకు కేవలం ఒకే ఒక అడుగు దూరంలో ఉంది కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్. ఇరు జట్ల బలాలు చూస్తే బౌలింగ్ లో అత్యంత బలంగా కనిపిస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఇక బ్యాటింగ్ పరంగా రాజస్తాన్ దుమ్ము రేపుతోంది. ఆరెంజ్ క్యాప్ రేసులో రాయల్స్ తరపున జోస్ బట్లర్ టాప్ లో ఉండగా ఇదే జట్టుకు చెందిన బౌలర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నెంబర్ 1లో ఉన్నాడు.
సెమీ ఫైనల్ గా భావించే క్వాలిఫయిర్ 2 మ్యాచ్ లో ప్రధానంగా రాజస్తాన్(RR Batting Qualifier2) కు ప్రధాన ఆయుధం బ్యాటింగ్. దేవదత్ పడిక్కల్ , యశస్వి జైశ్వాల్ , జోస్ బట్లర్ , సంజూ శాంసన్ , రవిచంద్రన్ అశ్విన్ , సిమ్రోన్ హిట్ మైర్ , రియాన్ పరాగ్ ఉన్నారు.
ఇప్పటి వరకు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ ఆశించిన మేర రాణించ లేక పోయాడు. గుజరాత్ తో జరిగిన క్వాలిఫయిర్ -1 లో రాణించాడు. రాజస్తాన్ గనుక 200 నుంచి 230 పరుగులు చేస్తేనే జట్టు విజయంపై నమ్మకం పెట్టుకుంటుంది.
లేక పోతే ఓడి పోవడం ఖాయం. ఏడు మంది బ్యాటర్లలో కనీసం 5 మంది బ్యాటర్లు రాణించ గలిగితే ఆర్సీబీకి చుక్కలు చూపించడం భారీ స్కోర్ సాధించే చాన్స్ ఉంది.
మొత్తంగా చూస్తే ఆర్సీబీతో మ్యాచ్ తో గెలవడం అంటే అంత సులభం కాదని తెలుసు కోవాల్సి ఉంటుంది. రాజస్తాన్ కు కావాల్సింది కెప్టెన్ శాంసన్ రాణించాల్సిన అవసరం ఉంది.
Also Read : డుప్లెసిస్ ప్లాన్ సక్సెస్ అవుతుందా