RR vs LSG IPL 2022 : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ
24 పరుగుల తేడాతో లక్నో జెయింట్స్ ఓటమి
RR vs LSG IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో సత్తా చాటింది సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్(RR vs LSG IPL 2022). ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
దీంతో పాయింట్ల పట్టికలో నిన్నటి దాకా రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ మూడో ప్లేస్ కు చేరింది. శాంసన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 178 పరుగులు చేసింది. 179 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది.
24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 16 పాయింట్లతో సమ ఉజ్జీగా ఉన్నా నెట్ రన్ రేట్ లో రాజస్థాన్ లక్నో(RR vs LSG IPL 2022) కంటే ముందంజలో ఉంది. రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు.
టెంట్ బౌల్ట్ , మెక్కాయ్ , ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్ , యుజ్వేంద్ర చాహాల్ చెరో వికెట్ తీసి సత్తా చాటారు. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 178 రన్స్ చేసింది.
బట్లర్ త్వరగా ఔట్ కాగా యశస్వి జైశ్వాల్ 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దేవదత్ పడిక్కల్ 39, సంజూ శాంసన్ 32 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్ 2, ఆవేష్ ఖాన్ , జేసన్ హోల్డర్ , ఆయుష్ బదోని చెరో వికెట్ తీశారు.
Also Read : భారత జట్టుకు కోటి నజరానా