RR vs RCB : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో అసలైన పోరాటానికి వేదిక కానుంది ముంబై. ఓ వైపు రాజస్థాన్ రాయల్స్(RR vs RCB) ఇంకో వైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఇరు జట్లు బలంగా ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్ ఘోరమైన ఓటమిని చవి చూసిన బెంగళూరు రాజస్థాన్ ను ఓడించేందుకు సిద్దమైంది.
ఇక అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపుతూ తనకు ఎదురే లేదంటూ
దూసుకు పోతున్న రాజస్థాన్ మరో విజయం సాధించేందుకు రెడీ అవుతోంది.
ఇక పాయింట్ల పరంగా చూస్తే రాజస్థాన్ ఇప్పటి దాకా 7 మ్యాచ్ లు ఆడింది 2 ఓడి పోగా 5 మ్యాచ్ లలో విజయం సాధించింది.
ఇక బెంగళూరు 8 మ్యాచ్ లు ఆడింది 3 ఓడి పోయింది 5 మ్యాచ్ లలో గెలుపొందింది. ఇక జట్ల పరంగా చూస్తే
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజూ శాంసన్ కెప్టెన్. జోస్ బట్లర్ , రాస్సీ వాన్ డస్సెస్ , దృవ్ జురెల్, జేమ్స్ నీషమ్ ,
శుభమ్ గర్వాల్, కుల్దీప్ సేన్ , షిమ్రోన్ హెట్మేయర్ , దేవదత్ పడిక్కల్ , యజువేంద్ర చహల్ ఆడనున్నారు.
వీరితో పాటు ట్రెంట్ బౌల్ట్ , నాథన్ కౌల్టర్ నైల్ , రవిచంద్రన్ అశ్విన్ , ప్రసీద్ కృష్ణ, తేజాస్ బరోకా, ఓబెద్ మెకాయ్,
రియాన్ పరాగ్, డారిల్ మిచెల్ , అనునయ్ సింగ్ , యశస్వి జైస్వాల్ , నవదీప్ సైనీ, కరుణ్ నాయర్, కేసి కరియప్ప, కుల్దీప్ యాదవ్ ఆడతారు.
రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (RR vs RCB)జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్. ఇక జట్టులో విరాట్ కోహ్లీ, రూథర్ ఫోర్డ్ , లువ్నిత్ సిసోడియా, గ్లెన్ మాక్స్ వెల్
, వానిందు హసరంగా, అనీశ్వర్ గౌతమ్ , సిద్దార్త్ కౌల్ , జోష్ హాజల్ వుడ్ ఆడతారు. దినేశ్ కార్తీక్ , మహిపాల్ లామ్రోర్ , అనుజ్ రావత్ , డేవిడ్ విల్లీ,
ఫిన్ అలెన్ , కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్ , జాసన్ బెహ్రిండోర్స్ , చామ వి మిలింద్ , ప్రభు దేశాయ్, షాబాద్ అహ్మద్ , హర్షల్ పటేల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.
Also Read : అంబటి రాయుడు అదుర్స్