RR vs RCB Qualifier2 : బట్లర్ సెంచరీ ఫైనల్ కు చేరిన రాజస్థాన్
7 వికెట్ల తేడాతో గెలుపొందిన రాయల్స్
RR vs RCB Qualifier2 : ఐపీఎల్ 2022 ఫైనల్లోకి రాజస్తాన్ రాయల్స్ రాయల్ గా ఎంటర్ అయ్యింది. క్వాలిఫయిర్ -1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఓటమి పాలైన రాజస్తాన్ అద్భుతంగా రాణించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో.
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ప్రత్యర్థి జట్టును కేవలం 20 ఓవర్లలో 157 పరుగులకే కట్టడి చేసింది.
అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ vs బెంగళూరుకు(RR vs RCB Qualifier2) చుక్కలు చూపించింది. ఐపీఎల్ టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న రాజస్తాన్ స్టార్ ప్లేయర్ ఇంగ్లండ్ హిట్టర్ జోస్ బట్లర్ మరోసారి రెచ్చి పోయాడు.
దుమ్ము రేపాడు. సెంచరీతో దంచి కొట్టాడు. 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తానే అన్నీ అయి ముందుండి నడిపించాడు. జైశ్వాల్ , కెప్టెన్ సంజూ శాంసన్ 23 పరుగులకే వెనుదిరిగినా. టార్గెట్ తక్కువగా ఉండడం కూడా రాజస్తాన్ కు కలిసి వచ్చింది.
గుజరాత్ తో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు. మరో వైపు మెక్ కాయ్ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడమే కాకుండా కీలకమైన దశలో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు.
మొత్తంగా రాజస్తాన్ రాయల్స్ రాజసమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి దర్జాగా ఐపీఎల్ 2022లో ఫైనల్ కు చేరింది.
ఈ మ్యాచ్ మొత్తం జోస్ బట్లర్ దేనని చెప్పక తప్పదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడికే ప్రకటించింది ఐపీఎల్.
Also Read : రాజస్తాన్ రాజసం బెంగళూరు పరాజయం