RR vs RCB Qualifier2 : రాజస్తాన్ రాజసం బెంగళూరు పరాజయం
14 ఏళ్ల విరామం అనంతరం ఆర్ఆర్
RR vs RCB Qualifier2 : ఐపీఎల్ 2022 టైటిల్ కు ఒకే ఒక అడుగు దూరంలో ఉంది కేరళ సూపర్ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ . నువ్వా నేనా అన్న రీతిలో క్వాలిఫయిర్ -2 మ్యాచ్ జరుగుతుందని అంతా భావించారు. కానీ మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మోదీ మైదానంలో జరిగిన గేమ్ లో ఏకంగా ప్రత్యర్థి జట్టు రాయల్స్ ఛాలెంజర్స్ vs బెంగళూరు(RR vs RCB Qualifier2) పై 7 వికెట్ల తేడాతో సునాయసంగా విజయాన్ని నమోదు చేసింది.
దర్జాగా ఫైనల్ కు చేరింది. రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ ఫైనల్ కు చేరడానికి 14 ఏళ్లు పట్టింది. అటు బ్యాటింగ్ లో ఇటు
బౌలింగ్ లో రాజస్తాన్ రాణించింది.
ప్రధానంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫయిర్ -1 మ్యాచ్ లో ధారాళంగా పరుగులు ఇచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రసిద్ద్ క్రిష్ణ
ఏకంగా మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.
మెక్ కామ్ మూడు వికెట్లు తీసి పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. మొత్తం ఈ మ్యాచ్ పూర్తిగా రాజస్తాన్ దేనని చెప్పదు. తాజా, మాజీ
ఆటగాళ్లు ఏ మాత్రం రాజస్తాన్ ను పరిగణలోకి తీసుకోలేదు.
పైగా బెంగళూరు గెలుస్తుందని, టైటిల్ కూడా వాళ్లదేనంటూ నోరు పారేసుకున్న వాళ్లకు రాజస్తాన్ తనదైన శైలిలో ఆడి నోళ్లు మూయించింది.
ఈ ఐపీఎల్ లో పడుతూ లేస్తూ చివరి దాకా వచ్చింది ఆర్ఆర్.
టాస్ గెలిచిన సంజూ శాంసన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. అనంతరం
బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ (RR vs RCB Qualifier2) దుమ్ము రేపింది.
మొదటి నుంచే దాడి చేయడం ప్రారంభించింది. ఫస్ట్ రెండు ఓవర్ల లోనే సిక్సర్లు, ఫోర్లు కొట్టాడు యశస్వి జైశ్వాల్. సిరాజ్ కు చుక్కలు
చూపించాడు. ఇక ఇంగ్లాండ్ స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ శాంసన్ 23 రన్స్ చేసి మరోసారి హసరంగకు దొరికి పోయాడు. 7 వికెటల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
Also Read : ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడిదే