ED Attaches IREO : రూ. 1,317 కోట్ల ఐరియో గ్రూప్ ఆస్తులు అటాచ్

సంస్థ ఎండీ ల‌లిత్ గోయాల్ కు బిగ్ షాక్

ED Attaches IREO : దేశంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు జూలు విదిల్చాయి. తీగ లాగితే డొంకంతా క‌దులుతోంది. కోట్లాది రూపాయ‌లను పోగేసుకుని దేశాన్ని దివాలా తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌డుతున్నాయి.

తాజాగా మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఏకంగా రూ. 1,317 కోట్ల ఐరియో గ్రూప్ సంస్థ‌ల ఆస్తుల‌ను అటాచ్(ED Attaches IREO) చేసింది ఈడీ. అటాచ్ చేసిన ఆస్తుల‌లో భూములు, వాణిజ్య స్థ‌లాలు, ప్లాట్లు, నివాస గృహాలు , బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. రియ‌ల్ ఎస్టేట్ కంపెనీగా ఉంది ఐరియో గ్రూప్ కంపెనీ లిమిటెడ్. దీనికి మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఉన్నారు ల‌లిత్ గోయ‌ల్.

మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం 2002 కింద ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన‌ట్లు ఈడీ అధికారిక ప్ర‌క‌ట‌న‌లో వెళ్ల‌డించింది. దేశంలోని గురుగ్రామ్ , పంచకుల‌, లూథియానా, ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేష‌న్ల‌లో ఐరియో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి 1860లోని సెక్ష‌న్ 120-బి, 420, 467, 471 కింద 30 ఎఫ్ఐఆర్ లు న‌మోదైన‌ట్లు తెలిపింది ఈడీ.

న‌మోదైన కేసుల ఆధారంగా మ‌నీ లాండ‌రింగ్ కింద ద‌ర్యాప్తు చేశామ‌ని వెల్ల‌డించింది. కంపెనీకి సంబంధించి ఎండీతో పాటు డైరెక్ట‌ర్లు, ఇత‌ర ముఖ్య వ్య‌క్తులను విచారించామ‌ని పేర్కొంది ఈడీ.

ప్లాట్లు, ఫ్లాట్లు, వాణిజ్య స్థ‌లాల‌ను పంపిణీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అమాయ‌క కొనుగోలుదారుల నుండి భారీ ఎత్తున కోట్లు వ‌సూలు చేశారు. తీరా మోసానికి పాల్ప‌డ్డారని పేర్కొంది. ప్రాజెక్టులు ప్రారంభించ లేదు. తీసుకున్న డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది ఈడీ. ఈడీ దూకుడుతో ఇత‌ర రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.

Also Read : చ‌ట్టాలు ప్రాంతీయ భాష‌ల్లో ఉండాలి – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!