RS Praveen Kumar : సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్పి

మరోవైపు బీఆర్‌ఎస్‌లో చేరితే తాను ప్రజలకు సమాధానం చెప్పాలనడం ఎంతవరకు సబబు అని అన్నారు

RS Praveen Kumar : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తారంటూ వస్తున్న వదంతులపై స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఆ పదవిని తాను గౌరవంగా తిరస్కరించానని వివరించారు. తనకు ప్రభుత్వ పదవులు అవసరం లేదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఒకవైపు రేవంత్ తాను పాలమూరు బిడ్డననే అంటున్నాడు.

RS Praveen Kumar Comments Viral

మరోవైపు బీఆర్‌ఎస్‌లో చేరితే తాను ప్రజలకు సమాధానం చెప్పాలనడం ఎంతవరకు సబబు అని అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే, రేవంత్ తనకు వార్నింగ్ ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచిన వెంటనే తాను జాయిన్ అవ్వడానికి.. తాను అసమర్థుణ్ని కానని.. నిజమైన నిస్వార్థమైన నిజాయతీ కోసం ప్రజల్లోకి వచ్చానని స్పష్టం చేసారు.

Also Read : EC : లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

Leave A Reply

Your Email Id will not be published!