RS Praveen Kumar : ప్రారంభోత్స‌వం స‌రే న‌డిగ‌డ్డ‌ మాటేంటి

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. గ‌ద్వాల‌లో క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి వ‌స్తున్నారు స‌రే న‌డిగ‌డ్డ‌ను ఎందుకు నిర్ల‌క్ష్యం చేశారో చెప్పాల‌ని నిల‌దీశారు. సోమ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. గ‌తంలో పాల‌కులు ఈ ప్రాంతాన్ని నిర్ల‌క్ష్యం చేస్తే త‌మ‌రు కొలువు తీరాక పూర్తిగా స‌ర్వ నాశ‌నం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

మాయ మాట‌లు చెప్ప‌డం త‌ప్ప ఏనాడైనా మంచి ప‌నులు చేశారా అని కేసీఆర్ ను ప్ర‌శ్నించారు. మీ అభివృద్ది నిధి నుండి గ‌త 9 ఏళ్ల కాలంలో న‌డిగ‌డ్డ‌లోని అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి మీరిచ్చింది కేవ‌లం రూ. 20 కోట్లు మాత్ర‌మేన‌ని ఎద్దేవా చేశారు. అదే గ‌జ్వేల్ కు రూ. 650 కోట్లు ఇచ్చార‌ని , ఇందులో మీ ఫామ్ హౌస్ ఉంద‌ని ఇచ్చారంటూ అంటూ నిప్పులు చెరిగారు బీఎస్పీ చీఫ్‌.

న‌డిగ‌డ్డ‌కు ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్ని జాబ్స్ ఇచ్చారో, ఎన్ని ఇండ్లు మంజూరు చేశారో చెప్పాల‌ని నిల‌దీశారు. ఈ ప్రాంతానికి ఎందుక‌ని మెడిక‌ల్, ఇంజ‌నీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్ , పాలిటెక్నిక్ కాలేజీలు ఇవ్వలేద‌ని సూటిగా సీఎంను నిల‌దీశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ పై ఉన్నంత ప్రేమ ఎందుక‌ని తుమ్మిళ్ల‌, నెట్టెంపాడు, ఆర్డీఎస్ మీద ఎందుకు లేద‌ని భ‌గ్గుమ‌న్నారు.

యాదాద్రి మీద ఉన్న శ్ర‌ద్ద జోగులాంబ , బీచుప‌ల్లి దేవాల‌యాల మీద ఎందుకు లేద‌న్నారు. వాల్మీకి బోయ‌ల‌ను ఎందుకు ఎస్టీలుగా ప్ర‌క‌టించ‌డం లేద‌ని నిల‌దీశారు బీఎప్పీ చీఫ్‌. వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి ఇస్తాన‌ని చెప్పితివి..మాట మ‌రిచితివి అంటూ మండిప‌డ్డారు.

Also Read : Vijaya Sai Reddy : ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు

 

Leave A Reply

Your Email Id will not be published!