RS Praveen Kumar : బహుజన రాజ్యం వస్తేనే విముక్తి
బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్పీ
RS Praveen Kumar : దొరల, గడీల పాలన అంతం కావాలంటే బహుజనులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
రాష్ట్రంలో ఆయన బహుజన యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఓటుకు ఉన్న విలువ ఏంటో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలియ చేస్తున్నారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మనం తెలుసుకోక పోతే మనం జీవిత కాలం మోసాలకు గురవుతూనే ఉంటామని హెచ్చరించారు.
తెలంగాణలో ప్రస్తుతం సామాన్యులు, పేదలు, బహుజనులు, మైనార్టీలు బతికే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమం పేరుతో మోసం చేసిందన్నారు.
అధికారంలోకి వచ్చాక గడీల పాలనను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. విద్య, వైద్యం, ఉపాధిని పేదలకు దూరం చేసిందని ఆరోపించారు. ఎప్పుడైతే విద్యను దూరం చేసిందో ఆరోజు నుంచే ప్రజలకు ప్రభుత్వం పట్ల అవగాహన అన్నది ఉండదన్నారు.
విభజించు పాలించు అన్న కాన్సెప్ట్ తో టీఆర్ఎస్ సర్కార్ ముందుకు వెళుతోందన్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఆర్ఎస్పీ .
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉంటే ఇప్పటి వరకు కొన్ని కూడా భర్తీ చేయలేదన్నారు. ఇంకా నోటిఫికేషన్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరి బాధలు తొలగాలంటే , సమస్యలు పరిష్కారం కావాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు.
Also Read : నా తెలంగాణ కోటి రతణాల వీణ