RTC Bus Theift Arrest : దొరికిన ఆర్టీసీ బస్సు దొంగ
ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు
RTC Bus Theift Arrest : సిరిసిల్ల – తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఆర్టీసీ బస్సు చోరీ చేసిన సంఘటన. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బస్సును ఎత్తుకు వెళ్లిన నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో చోటు చేసుకుంది.
RTC Bus Theift Arrest Victim
సిద్దిపేటలో ప్రయాణీకులతో సిద్దంగా ఉన్న ఆర్టీసీ బస్సును స్టార్ట్ చేసుకుని వేములవాడకు వెళ్లాడు. అక్కడి నుండి తిరిగి సిద్దిపేటకు(Siddipet) వెళుతుండగా డీజిల్ అయి పోవడంతో బస్సును దారి మధ్య లోనే నిలిపి వేశాడు. దీంతో విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఆర్టీసీ బస్సును తీసుకు వెళ్లిన నిందితుడిని గుర్తించారు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఏకంగా బస్సును ఎందుకు చోరీ చేయాలని అనుకున్నాడనే దానిపై ఖాకీలు కూపీ లాగుతున్నారు. అతడు కావాలని చేశాడా లేక మతి స్థిమితం తప్పాడా అన్న దానిపై విచారిస్తున్నారు. మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సు చోరీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Yennam Srinivas Reddy Jitta : హస్తం గూటికి జిట్టా..యెన్నం