Russia Launched Missiles : ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి
ఇప్పటి వరకు 5 గురు మృతి
Russia Launched Missiles : క్రిమియాను రష్యాకు కలిపే వంతెనపై పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి ఉక్రెయిన్ కారణమని ఆరోపిస్తూ సోమవారం మూకుమ్మడిగా మిస్సైల్స్ తో దాడులకు తెగ బడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రెసిడెన్సీ వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదుగురు మరణించినట్లు తెలిపింది.
వంతెనపై ఉక్రెయిన్ దాడి చేశారంటూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆరోపించారు. ఆయన పేర్కొన్న గంట లోపే కైవ్ లో పేలుళ్లు సంభవించాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ పై క్షిపణుల దాడులు(Russia Launched Missiles) కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక నగరాల్లో దాడుల గురించి సమాచారం ఉంది.
ప్రెసిడెంట్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ కైరీలో టిమో షెంకో సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. ఎవరూ బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాలలో తలదాచు కోవాలని కోరారు. ఇవాళ ఉదయం ఏకంగా ఉక్రెయిన్ పై 75 క్షిపణులను ప్రయోగించిందని కైవ్ ఆరోపించింది. పలువురు గాయపడ్డారు.
విచక్షణా రహితంగా దాడులకు తెగబడింది రష్యా. అనేక అంబులెన్స్ లు సహాయక ప్రదేశాలకు బయలు దేరాయి. మధ్యలో అనేక పేలుళ్లు సంభవించాయి. నగరంలో అనేక ప్రాంతాలలో నల్ల పొగలు కమ్ముకున్నాయి. ఉగ్రవాద చర్యగా అభివర్ణించాడు.
బాంబు దాడిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ కమిటీ చీఫ్ తో జరిగిన సమావేశంలో పుతిన్ మాట్లాడినట్లు రష్యా వార్తా సంస్థలు నివేదించాయి. తన భద్రతా మండలితో సమావేశానికి సిద్దమవుతున్నారని క్రెమ్లిన్ స్థానిక వార్తా సంస్థలకు తెలిపింది.
Also Read : జైల్ భరో ఉద్యమానికి రెడీ – ఇమ్రాన్ ఖాన్