Ruturaj Gaikwad : సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్
చుక్కలు చూపించిన క్రికెటర్
Ruturaj Gaikwad : ఐపీఎల్ లో మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad). ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన కీలక పోరులో సత్తా చాటాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
49 బాల్స్ ఎదుర్కొన్న కాన్వే 87 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 5 సిక్సర్లు కొట్టాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) 33 బంతుల్లో 41 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి.
ఇక 209 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 91 పరుగుల తేడో ఘోర పరాజయాన్ని చవి చూసింది. శివమ్ దూబే 32 రన్స్ చేశాడు.
2 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఎదుర్కొన్నవి 19 బంతులే. ధోనీ 8 బంతులు ఆడి 21 రన్స్ చేసి నాటౌట్ మిగిలాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) పూర్తి పేరు రుతురాజ్ దశరథ్ గైక్వాడ్
. 31 జనవరి 1997. వయసు 25 ఏళ్లు. స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. కుడి చేతి వాటం బ్యాటర్. 28 జూలై 2021 లో శ్రీలంకతో టీ20 లో అరంగేట్రం చేశాడు.
చివరి టీ20 ఫిబ్రవరి 2022లో విండీస్ తో ఆడాడు. 2016లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2020 చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు.
ఇదిలా ఉండగా రుతురాజ్ గైక్వాడ్ 2021 లో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ టోర్నీలో అత్యధిక పరుగుల స్కోరర్ గా నిలిచాడు.
అదే ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో టీ20కి మహారాష్ట్రకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
Also Read : డేవాన్ కాన్వే మారథాన్ ఇన్నింగ్స్