Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్డేట్ ఇచ్చిన తెలంగాణ సర్కార్
క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు...
Rythu Bharosa : రైతు భరోసా పంపిణీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పథకం అమలు విధి విధానాల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ.. గురువారం నాడు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రైతు భరోసా(Rythu Bharosa)కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రివర్గ సభ్యులు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎంతమేర భూమికి ఇవ్వాలి.. ఈ పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి జమ చేయాలి.. అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.
TG Rythu Bharosa Updates
క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. అలాగే.. రైతు భరోసా కోసం రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఈ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ఇక జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read : CM Chandrababu : రెవెన్యూ సమస్యల పరిష్కారం ఆలస్యానికి అధికారులపై భగ్గుమన్న సీఎం