S Jaishankar : తన పాక్ ప్రయాణం పై వస్తున్న విమర్శలకు స్పందించిన విదేశాంగ మంత్రి
ఆ కారణం వల్లే ఇటీవల కాలంలో సార్క్ సమావేశాలు జరగడంలేదన్నారు...
S Jaishankar : ఈనెల 15,16 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కోసం పాకిస్థాన్ వెళ్తున్న ఢిల్లీ విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తన పర్యటనలో దాయాది దేశంతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని తెలిపారు. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి వచ్చిన జైశంకర్(S Jaishankar) మీడియాతో మాట్లాడుతూ, బహుళపక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను వెళ్తున్నానని, భారత్-పాక్ సంబంధాల గురించి మాట్లాడేందుకు కాదని చెప్పారు. ఎస్‌సీఓలో సభ్యుడిగానే తాను అక్కడకు వెళ్తున్నానని, తనొక మర్యాద కలిగిన పౌరుడనని, అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తారని తెలిపారు.
S Jaishankar Comment
సౌత్ ఏసియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కో-ఆపరేషన్ కార్యక్రమాలు నిలిచిపోవడంపై పాక్‌ను జైశంకర్ పరోక్షంగా తప్పుపట్టారు. ప్రస్తుతానికైతే సార్క్ కార్యక్రమాలు ముందుకు వెళ్లడం లేదని, సార్క్‌లోని ఒక సభ్యదేశం ఆ గ్రూపునకే చెందిన మరో దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని పాక్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఆ కారణం వల్లే ఇటీవల కాలంలో సార్క్ సమావేశాలు జరగడంలేదన్నారు. అయితే ప్రాంతీయ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్టు కాదన్నారు. నిజానికి గత ఐదేరేళ్లుగా భారత ఉపఖండంలో ప్రాంతీయ సమైక్యత పెరిగిందని చెప్పారు. కాగా, గత తొమ్మిదేళ్లలో భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్ వెళ్తుండటం ఇదే మొదటిసారి. ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆప్ గవర్నమెంట్ సమావేశానికి ఈసారి పాక్ ఆతిథ్యం ఇస్తోంది.
Also Read : TG Governor-HYDRA : ‘హైడ్రా’ కు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసిన గవర్నర్ జిష్ణుదేవ్వర్మ