SA vs AFG ICC World Cup : స‌ఫారీ దెబ్బ ఆఫ్గాన్ అబ్బా

సెమీ ఫైన‌ల్ కు చేరుకున్న జ‌ట్టు

SA vs AFG ICC World Cup : ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆఫ్గ‌నిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ఊహించ‌ని షాక్ నుంచి తేరుకునే లోపే మ‌రో దెబ్బ ద‌క్షిణాఫ్రికా రూపంలో వ‌చ్చింది.

SA vs AFG ICC World Cup Updates

ఇప్ప‌టికే ఇంగ్లండ్, పాకిస్తాన్, నెద‌ర్లాండ్ జ‌ట్ల‌ను మ‌ట్టి క‌రిపించిన ఆఫ్గ‌నిస్తాన్ చివ‌రి దాకా పోరాడింది. కానీ ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇక భార‌త జ‌ట్టు చేతిలో ఊహించ‌ని ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకున్న స‌ఫారీ టీం ప‌ట్టుద‌ల‌తో ఆడింది. ఆఫ్గాన్ పై గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

మొత్తంగా 8 విజ‌యాల‌తో దూసుకు పోతున్న భార‌త జ‌ట్టు సెమీస్ లో న్యూజిలాండ్ జ‌ట్టుతో త‌ల‌ప‌డే ఛాన్స్ ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ఇక శ్రీ‌లంకను మ‌ట్టి క‌రిపించిన కీవీస్ నేరుగా సెమీస్ ఆశ‌ల్ని స‌జీవంగా ఉంచుకుంది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆప్గ‌నిస్తాన్ ను క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్ ప‌రంగా డ‌సెన్ కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడ‌డంతో విజ‌యం సాధ్య‌మైంది. ఆఫ్గ‌నిస్తాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 244 ర‌న్స్ ఆలైటింది. ఆల్ రౌండ‌ర్ అజ్మ‌తుల్లా 7 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 97 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నాడు. గుర్బాజ్ 25, జ‌ద్రాన్ 15, ర‌హ్మ‌త్ షా 26, నూర్ అహ్మ‌ద్ 26 ర‌న్స్ తో రాణించారు.

బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా 47.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 247 ర‌న్స్ చేసి విజ‌యం సాధించింది. డ‌సెన్ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. 76 ప‌రుగులు చేశాడు. డికాక్ 41 , ఫెలుక్వాయో 39 నాటౌట్ , మార్క్స్ 25, మిల్ల‌ర్ 24, బ‌వుమా 23 ర‌న్స్ చేసి కీల‌క పాత్ర పోషించారు.

Also Read : BRS Joinings : కాంగ్రెస్ కు షాక్ బీఆర్ఎస్ కు జంప్

Leave A Reply

Your Email Id will not be published!