Saba Karim : వాళ్లంద‌రి కంటే జో రూట్ సూప‌ర్

మాజీ బీసీసీఐ సెలెక్ట‌ర్ స‌బా క‌రీం

Saba Karim : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) మాజీ సెలెక్ట‌ర్ స‌బా క‌రీం(Saba Karim)  షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్ర‌పంచ క్రికెట్ లో అద్భుత‌మైన ఆట తీరుతో ప్ర‌స్తుతం ఆడుతున్న క్రికెట‌ర్ల‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయ‌ర్ జో రూట్ టాప్ లో ఉన్నాడ‌ని కితాబు ఇచ్చాడు.

ప్ర‌స్తుతం స‌బా క‌రీం చేసిన ఈ వ్యాఖ్య‌లు క్రికెట్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. భార‌త జ‌ట్టుకు చెందిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ , న్యూజిలాండ్ కు చెందిన కేన్ విలియ‌మ్స‌న్ కంటే అత్యుత్త‌మంగా జో రూట్ ఆడుతున్నాడ‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు స‌బా కరీం.

కాగా స్వ‌దేశంలో లార్డ్స్ తో న్యూజిలాండ్ తో జ‌రిగిన మొద‌టి టెస్టులో జో రూట్ చివ‌రి దాకా ఆడాడు. 115 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. త‌న జ‌ట్టును విజ‌య ప‌థాన న‌డిపించాడు.

అంతే కాదు ఇంగ్లండ్ క్రికెట్ చ‌రిత్ర‌లో 37 ఏళ్ల 154 రోజుల సుదీర్ఘ కాలం త‌ర్వాత జో రూట్ 10,000 ప‌రుగులు చేసి అరుదైన ఘ‌న‌త సాధించాడు. రెండో ఆట‌గాడు కావ‌డం విశేషం.

కాగా వ‌ర‌ల్డ్ వైడ్ గా ప‌ది వేల ర‌న్స్ పూర్తి చేసిన వారిలో జో రూట్ 14వ క్రికెట‌ర్ . 69 ప‌రుగుల వ‌ద్ద 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇక్క‌ట్ల‌లో ఉన్న ఇంగ్లండ్ జ‌ట్టును ఒడ్డుకు చేర్చాడు.

277 ప‌రుగుల భారీ టార్గెట్ ను ఛేదించి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. ఈ ముగ్గురు గొప్ప ఆటగాళ్లే కాద‌న‌ను. కానీ వీళ్లంద‌రి కంటే ఆట తీరులో ప్ర‌త్యేక‌త‌ను జో రూట్ క‌లిగి ఉన్నాడ‌ని పేర్కొన్నాడు స‌బా క‌రీం.

స్థిర‌త్వం, టెక్నిక్ లో అత‌డు సూప‌ర్ గా ఆడుతున్నాడంటూ పేర్కొన్నాడు.

Also Read : రెచ్చి పోయిన వార్న‌ర్ రాణించిన‌ ఫించ్

Leave A Reply

Your Email Id will not be published!