Sachin Tendulkar : భారత మాజీ క్రికెట్ దిగ్గజం టెండూల్కర్ అరుదైన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
తాను రిటైర్మెంట్ సందర్భంగా తన తండ్రి తనకు ఇచ్చిన దారాన్ని భద్రంగా కోహ్లీ తనకు ఇచ్చాడంటూ భావోద్వాగానికి గురయ్యాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar ). తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
2013లో ప్రపంచ క్రికెట్ రంగం నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా చోటు చేసుకున్న అరుదైన సన్నివేశాన్ని పంచుకున్నాడు సచిన్. కోట్లాది అభిమానులకే కాదు చాలా మంది ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచాడు.
కోహ్లీని ఈ సందర్భంగా ప్రశంసలతో ముంచెత్తాడు. తన తండ్రి తనకు ఇచ్చిన ప్రేమ పూర్వకమైన చేతికి కట్టుకునే దారాన్ని తిరిగి కోహ్లీ తనకు ఇచ్చాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
జీవితంలో గొప్ప బహుమతి ఇంతకంటే ఇంకేం ఉంటుందని ప్రశ్నించాడు. మా నాన్న చని పోయినప్పుడు నేను ఒంటరిగా ఒక మూలలో తలపై టవల్ తో కూర్చున్నా. కన్నీళ్లు తుడుచుకుంటున్నా.
ఏమీ తోచలేదు. ఎన్నో ఏళ్లుగా మా తండ్రి మాతో కలిసి ఉన్నాడు. ఇక లేరని తెలిసే సరికి దుఖఃం ఆపుకోలేక పోయానన్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ నా వద్దకు వచ్చాడు.
తన తండ్రి తనకు ఇచ్చిన పవిత్రమైన దారాన్ని ఇచ్చాడన్నాడు. ఈ విషయాన్ని అమెరికన్ జర్నలిస్ట్ గ్రాహం బెన్ సింగర్ తో పంచుకున్నాడు. మా నాన్న మణికట్టు కోసం ఓ దారాన్ని ఇచ్చాడు.
ఇంతకంటే ఏమీ ఇవ్వలేను. నేను నీకు ఇది ఇస్తున్నానంటూ చెప్పాడన్నాడు. దానిని తిరిగి కోహ్లీకి ఇచ్చానని అన్నాడు టెండూల్కర్(Sachin Tendulkar ). ఇది తన జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకంగా మిగిలి పోతుందన్నాడు.
Also Read : భువీ రాణిస్తే ఓకే లేదంటే కష్టం