Sachin Tendulkar : అర్జున్ టెండూల్కర్ ఎవరని అనుకుంటున్నారా భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)తనయుడు. క్రికెటర్ కూడా. ఐపీఎల్ లో కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం రంజీ కోసం ఆడుతున్నాడు.
ఎవరైనా తమ కొడుకు ఆడుతుంటే చూడాలని అనుకుంటున్నారు. కానీ అందుకు భిన్నంగా సచిన్ వ్యవహరిస్తున్నాడు. తన ఆట తాను ఆడనివ్వాలి. నేను చూడడం వల్ల అతడిలో అహం అన్నది మొదలవుతుంది.
అందుకే నేను స్టార్ ప్లేయర్ అయి ఉండవచ్చు. కానీ ఏ ప్లేయర్ అయినా రాణించాలంటే, ఎదగాలంటే, ఇంటర్నేషనల్ క్రికెటర్ కావాలని అనుకుంటే కింది నుంచే రావాలని స్పష్టం చేశాడు.
ఆటపై ఫోకస్ పెట్టాలి. అంతే కాదు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. రాను రాను ఆట ఆడటం అలవాటుగా మారింది పోతుందన్నాడు సచిన్ రమేష్ టెండూల్కర్(Sachin Tendulkar).
నేను దూరంగా ఉంటేనే నేర్చుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. రంజీ ట్రోఫీలో ముంబై జట్టులో భాగంగా ఉన్నాడు.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్ టెండూల్కర్ ను ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. క్రికెట్ ను బాగా ఆస్వాదించాలి.
అందుకు తగ్గట్టు బాగా కష్ట పడాలి. ఏదీ ఊరికే రాదన్నాడు సచిన్ టెండూల్కర్. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడు కోవడం చూస్తుంటే వారు ఒత్తిడికి లోనవుతారని పేర్కొన్నాడు.
తాను ఏం కావాలో సమకూర్చి పెట్టేందుకు రెడీగా ఉన్నాయి. ఇక ఆడడమే మిగిలి ఉందన్నాడు సచిన్.
Also Read : ఉత్కంఠ పోరులో టీమిండియాదే విక్టరీ